News August 26, 2024

బెంగాల్‌కు 123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు.. పనిచేస్తున్నవి 6 మాత్రమే

image

చిన్నారులు, మహిళలపై వేధింపులు, అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై విచార‌ణ జరపడానికి బెంగాల్‌కు 123 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు మంజూరు చేస్తే అందులో 6 పోక్సో కోర్టులు మాత్ర‌మే ప‌నిచేస్తున్న‌ట్టు కేంద్రం తెలిపింది. ఇటీవ‌ల ప్ర‌ధానికి CM మ‌మ‌తా బెనర్జీ రాసిన లేఖ‌పై కేంద్ర మంత్రి అన్న‌పూర్ణా దేవీ ఘాటుగా బ‌దులిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల 48,600 అత్యాచారం, పోక్సో కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపారు.

Similar News

News December 7, 2025

రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

image

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్‌లైన్‌లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News December 7, 2025

కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

image

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.

News December 7, 2025

ఇతిహాసాలు క్విజ్ – 89 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్రంలో పాల్గొన్న వృద్ధరాజు. భీష్ముడికి తండ్రి వరుస అవుతాడు. ధర్మం వైపు మొగ్గు ఉన్నా, రాజధర్మం కారణంగా కౌరవులకు మద్దతు ఇచ్చాడు. చివరికి భీముడి చేత మరణం పొందాడు. ఎవరతను?
సమాధానం: బాహ్లికుడు. ఈయన శంతనుడి సోదరుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>