News November 5, 2024
US బ్యాలెట్లో ‘బెంగాలీ’.. భారత్ నుంచి ఇదొక్కటే!

ఇవాళ జరిగే US ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అక్కడ బ్యాలెట్ పేపర్‌తోనే పోలింగ్ జరుగుతుంది. దీంతో వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచారు. అందులో భారత్ నుంచి బెంగాలీ మాత్రమే చోటు దక్కించుకుంది. మన జాతీయ భాష హిందీ అయినప్పటికీ న్యూయార్క్‌లో బెంగాలీల సంఖ్య ఎక్కువ. అందుకే 2013 నుంచి ఆ భాషను బ్యాలెట్లో కొనసాగిస్తున్నారు. దాంతోపాటు చైనీస్, స్పానిష్, కొరియన్ లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉంటుంది.
Similar News
News October 22, 2025
ఐఫోన్‌కు బదులు ఐక్యూ మొబైల్.. అమెజాన్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్

AP: అమెజాన్‌పై కర్నూలు జిల్లా కన్జూమర్ ఫోరం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వీరేశ్ ఇటీవల అమెజాన్‌లో రూ.80వేలతో ఐఫోన్ 15+ ఆర్డర్ చేయగా దానికి బదులు ఐక్యూ ఫోన్ వచ్చింది. కస్టమర్ కేర్‌ను సంప్రదించినా స్పందించకపోవడంతో కన్జూమర్ ఫోరాన్ని సంప్రదించాడు. బాధితుడికి ఐఫోన్ డెలివరీ చేయని పక్షంలో రూ.80వేల రీఫండ్‌తో పాటు మరో రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది. తదుపరి విచారణను NOV 21కి వాయిదా వేసింది.
News October 22, 2025
శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
News October 22, 2025
రేపు జగన్ మీడియా సమావేశం

AP: YCP చీఫ్ వైఎస్ జగన్ గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన రాజకీయాంశాలపై ఆయన మాట్లాడనున్నారు. పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ గురించి వివరిస్తారని తెలుస్తోంది. అలాగే నకిలీ మద్యం, రాజయ్యపేట బల్క్ డ్రగ్ పార్కు, కాకినాడ సెజ్ భూములు తదితరాలపై వివరాలు వెల్లడిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.