News June 4, 2024
భేష్ పోలీస్!
పోలింగ్ రోజు, అనంతర గొడవలతో APలో కౌంటింగ్ రోజు ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కానీ పోలీసులు కౌంటింగ్‌కు పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగారు. కేంద్ర బలగాలు, రిజర్వు పోలీసులూ వారం ముందే బందోబస్తుకు వెళ్లి అనేక చోట్ల మాక్ డ్రిల్స్, మార్చ్‌లతో తమ సామర్థ్యాలపై అవగాహన కల్పించారు. దీంతో ఘర్షణల ఆలోచన ఉన్నవారికి గట్టి మెసేజ్ వెళ్లింది. ఇది నేడు రచ్చ లేని క్లియర్ పిక్చర్ ఇచ్చింది. శభాష్ AP పోలీస్!
Similar News
News November 29, 2024
SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు!
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను <<14665980>>తెలుగు మీడియంలో<<>> రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు.
News November 29, 2024
నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.
News November 29, 2024
టెన్త్ పరీక్ష ఫీజు గడువు పెంపు
TG: పదో తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ 5 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లింపునకు నిన్నటితోనే గడువు ముగియగా విద్యార్థులు, టీచర్ల నుంచి విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రూ.50 ఫైన్‌తో DEC 12, రూ.200 ఫైన్‌తో 19 వరకు, రూ.500 ఫైన్‌తో 30వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు.