News April 19, 2025

OTTలో బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్స్.. ఈ వీకెండ్ చూసేయండి..

image

*Officer On Duty- Netflix: తాకట్టులో పెట్టిన దొంగ బంగారంతో కథ మొదలవుతుంది. కుంచాకో బోబన్ దర్యాప్తు.. ఒక సీరియల్ కిల్లర్ గ్యాంగ్‌ దగ్గరకు చేరుతుంది. ఇన్టెన్స్, యాక్షన్, ఎమోషన్‌తో సాగే ఒక బెస్ట్ క్రైమ్ డ్రామా.
*Dahaad(సిరీస్)- Prime: మిస్సైన అమ్మాయిలు పబ్లిక్ టాయిలెట్‌లో శవాలుగా దొరుకుతుంటారు. ఈ మిస్టరీ ఛేదించేందుకు సోనాక్షి యాక్షన్‌లోకి దిగుతుంది. పోలీసులతో కిల్లర్ ఆడే మైండ్ గేమ్ కట్టిపడేస్తుంది.

Similar News

News January 23, 2026

‘నైనీ’ బ్లాకులపై కేంద్ర బృందానికి సింగరేణి CMD నివేదిక

image

TG: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సభ్యుల బృందం హైదరాబాద్‌లో సింగరేణి CMD కృష్ణ భాస్కర్, ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. నైనీ బొగ్గు బ్లాకు టెండర్ ప్రక్రియ వివరాలను CMD ఆ బృందానికి సమర్పించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద వినియోగించిన నిధుల వివరాలనూ అందించాలని బృందం సభ్యులు అధికారులను కోరారు. రెండేళ్లుగా ప్రభుత్వం ‘రాజీవ్ అభయ హస్తం’ పథకానికి ఈ CSR నిధులనే వినియోగిస్తోంది.

News January 23, 2026

సంచలనం.. ట్రంప్ మళ్లీ పోటీ చేస్తారా?

image

తన మాటలు, చేతలతో వివాదాలు రేపుతున్న ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. ‘నేను నాలుగో సారి పోటీ చేయాలా?’ అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ‘TRUMP 2028, Yes’ అని రాసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. US రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా 2సార్లు పని చేయడానికే ఛాన్స్ ఉంది. 3సార్లు పోటీ చేసిన ట్రంప్ 2సార్లు గెలిచారు. మరి నాలుగోసారి పోటీకి తమ రాజ్యాంగాన్ని సవరిస్తారా?

News January 23, 2026

పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులు: లోకేశ్

image

AP: ఎలక్ట్రానిక్స్, మాన్యుఫ్యాక్చరింగ్‌కు రాష్ట్రం గమ్యస్థానమని మంత్రి లోకేశ్ తెలిపారు. APకి 160GW పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉందన్నారు. డిజిటలైజేషన్, డీకార్బనైజేషన్, డీ-గ్లోబలైజేషన్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయని, పాలనకు డిజిటల్ వ్యవస్థలు కేంద్రబిందువులుగా మారాయని తెలిపారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వకుంటే డేటా సెంటర్లు, AI కంప్యూట్ రంగాలను విస్తరించలేమని దావోస్ రెన్యూ పవర్ మీటింగ్‌లో చెప్పారు.