News October 26, 2024

కొత్త DGP పొంగులేటికి శుభాకాంక్షలు: KTR

image

TG: పలు స్కాముల్లో నవంబర్ 1 నుంచి 8 వరకు కీలక నేతల అరెస్టులు జరుగుతాయన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలపై మాజీ మంత్రి KTR సెటైర్లు వేశారు. ‘చూస్తుంటే తెలంగాణకు కొత్త DGP వచ్చినట్లున్నారు. కొత్త రోల్ పోషిస్తున్న పొంగులేటి గారికి శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు. అటు నల్గొండలో కానిస్టేబుళ్లు చేస్తున్న నిరసనపైనా KTR స్పందించారు. ‘తెలంగాణలో పోలీసులే పోలీసులకు రెబెల్స్‌గా మారారు’ అని కామెంట్ చేశారు.

Similar News

News October 26, 2024

డిప్యూటీ సీఎంను కలిసిన JAC నేతలు

image

TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఉద్యోగ సంఘాల JAC నేతలు కలిశారు. 2 DAలు, పెండింగ్ బిల్లులు సహా మరికొన్ని అంశాలను పరిష్కరించాలని కోరారు. ఇవాళ జరిగే క్యాబినెట్ భేటీలో వీటిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని భట్టి వారికి చెప్పారు.

News October 26, 2024

BREAKING: కష్టాల్లో భారత్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. 359 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత జట్టులో రోహిత్(8) వికెట్ త్వరగానే కోల్పోగా, గిల్(23), జైశ్వాల్(77) జోడీ స్కోరు బోర్డును కాసేపు పరుగులు పెట్టించారు. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే ఇద్దరూ ఔట్ కాగా, ఆ కాసేపటికే పంత్(0) కూడా రనౌట్ అయ్యారు. ప్రస్తుతం కోహ్లీ(14), సుందర్(3) ఆడుతున్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 225 రన్స్ చేయాలి.

News October 26, 2024

350+ రన్స్ ఛేదించడంలో ఇండియా తడబాటు!

image

రెండో టెస్టులో న్యూజిలాండ్‌పై గెలిచేందుకు టీమ్ఇండియా 358 రన్స్ చేయాల్సి ఉంది. అయితే, టీమ్ఇండియా 350+ స్కోరును కేవలం రెండు సార్లే ఛేదించింది. 350కి పైగా పరుగుల లక్ష్యంతో 63 ఇన్నింగ్స్ ఆడితే కేవలం రెండిట్లోనే గెలుపొంది 40 సార్లు ఓడిపోయింది. మరో 21 సార్లు డ్రా చేసుకుంది. 1976లో WIతో మ్యాచ్‌లో 403, 2008లో ENGతో మ్యాచ్‌లో 387 రన్స్‌ ఛేదించి ఇండియా గెలిచింది. మరి ఈ మ్యాచ్‌లో IND గెలుస్తుందా?