News March 31, 2025

బెట్టింగ్ యాప్స్.. సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

image

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేశ్‌ను నియమించారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మీ, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌ను పేర్కొన్నారు. ఇప్పటికే 25 సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వగా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.

Similar News

News January 15, 2026

బీసీలకు 42% సీట్లు.. పార్టీలు ఇచ్చేనా?

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో SC ఆదేశాలతో రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేశారు. BCలకు 42% స్థానాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్, BRSకు ఇదో అవకాశంగా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో 32%(38 స్థానాలు) కార్పొరేషన్‌లో 30%(3 చోట్ల) కేటాయించింది. కాగా హామీని నెరవేర్చేందుకు మరో 12 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలోనూ BC అభ్యర్థులనే ప్రకటించాల్సి ఉంది. మరి పార్టీలు ఎలాంటి ప్రకటన చేస్తాయో చూడాలి.

News January 15, 2026

కనుమ రోజు గారెలు తింటున్నారా?

image

కనుమ నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. చాలామంది కనుమరోజు కచ్చితంగా గారెలు తినేలా చూసుకుంటారు. అయితే పొట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.

News January 15, 2026

టెన్త్ అర్హతతో RBIలో ఉద్యోగాలు

image

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పదో తరగతి పాసైన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. కచ్చితంగా తమ స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 4. సైట్: <>rbi.org.in<<>>