News March 17, 2025
1000 మందిని బలి తీసుకున్న బెట్టింగ్ యాప్స్

TG: బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి గత ఏడాది రాష్ట్రంలో 1000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మొదట లాభాలను ఎరవేసే మోసగాళ్లు ఆపై నిండా ముంచుతున్నారు. దీనికి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ప్రమోషన్ తోడవ్వడంతో తారాస్థాయికి చేరింది. తాజాగా పలువురు నెటిజన్లు వీటిని వ్యతిరేకిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి సజ్జనార్ తోడవ్వడంతో ప్రమోటర్స్పై ప్రభుత్వం చర్యలకు దిగింది.
Similar News
News March 17, 2025
నటి రన్యారావుపై బీజేపీ MLA అసభ్య వ్యాఖ్యలు

బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన <<15652905>>నటి రన్యా రావుపై<<>> బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె శరీరంలోని అంగాంగంలో ప్రతీ చోట బంగారం పెట్టుకొని స్మగ్లింగ్ చేసిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న మంత్రుల పేర్లను అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడిస్తానని చెప్పారు. ఆమెకు సంబంధించిన పూర్తి సమాచారం తన దగ్గర ఉందన్నారు.
News March 17, 2025
ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే: సీఎం చంద్రబాబు

AP: 2047 కల్లా రాష్ట్ర తలసరి ఆదాయం రూ.55లక్షలు ఉండాలని, 2.4 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు చేరాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ.. ‘దేశంలో అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ. వికసిత్ భారత్-2047 కల్లా దేశం 30 ట్రిలియన్ డాలర్ల GDPకి చేరాలి. రాష్ట్రంలో నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలుపరిచే బాధ్యత MLAలదే. ఉమెన్ వర్క్ ఫోర్స్ పెరిగితే వేగవంతమైన అభివృద్ధి సాధ్యం’ అని తెలిపారు.
News March 17, 2025
ప్రతిపక్ష నేతలకు భట్టి ఫోన్.. అఖిలపక్ష భేటీపై ఆరా

TG: సరైన షెడ్యూల్ లేని కారణంగా పునర్విభజనపై అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. తేదీని ఖరారు చేయడం కోసం ఆరా తీశారు. సాయంత్రం భేటీ అవుదామని కోరగా రాజకీయ పార్టీల నుంచి స్పష్టత రాలేదు.