News May 12, 2024
బెట్టింగులే.. బెట్టింగులు

ఉత్కంఠ రేపుతున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌లు ఓ రేంజ్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది?, మెజార్టీలు, ప్రముఖ నాయకుల గెలుపోటములపై బెట్టింగ్ బాబులు భారీగా పందేలు వేస్తున్నారట. పిఠాపురం, మంగళగిరి, గన్నవరం, గుడివాడ, ఉండి, నగరి, నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు వెస్ట్, విజయవాడ సెంట్రల్, సత్తెనపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాలు పందేలకు హాట్సీట్లుగా మారాయని సమాచారం.
Similar News
News November 8, 2025
కేశాలకు కర్పూరం

కురులు అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. వాటిలో ఒకటే ఈ కర్పూరం నూనె. కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకొని నూనెలో వేసి 5నిమిషాలు మరిగించాలి. దీన్ని రాత్రి జుట్టు కుదుళ్లకు అప్లై చేసి తర్వాత రోజు ఉదయాన్నే తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే.. చుండ్రు, జుట్టు పొడిబారడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది.
News November 8, 2025
ఎంత కాలం రెంట్‌కి ఉన్నా ఓనర్లు కాలేరు: సుప్రీం

‘ది లిమిటేషన్ యాక్ట్-1963’ ప్రకారం 12 ఏళ్లు ఒకే ఇంట్లో ఉంటే ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు. అందుకే కొందరు తమ టెనంట్లను ఎక్కువ కాలం ఉండనివ్వరు. ఈక్రమంలో యజమానుల హక్కులను కాపాడుతూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. అద్దెకున్న ఇంట్లో ఎంతకాలం నివసించినా ఆ ఆస్తిపై యాజమాన్య హక్కు పొందలేరని స్పష్టం చేసింది. ఢిల్లీ కోర్టు తొలుత టెనంట్ పక్షాన నిలువగా.. సుప్రీం ఈ గందరగోళానికి ముగింపు పలికింది.
News November 8, 2025
మీ కలలను నెరవేర్చలేకపోతున్నా.. NEET విద్యార్థి సూసైడ్

వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే NEETలో ఫెయిలైనందుకు UPకి చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రావత్పూర్లోని హాస్టల్ గదిలో మహమ్మద్ ఆన్(21) సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘అమ్మానాన్న ప్లీజ్ నన్ను క్షమించండి. నేను చాలా ఒత్తిడిలో ఉన్నా. మీ కలలను నెరవేర్చలేకపోతున్నాను. నేను చనిపోతున్నా. దీనికి పూర్తిగా నేనే బాధ్యుడిని’ అని రాసి ఉన్న సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


