News February 28, 2025
జగన్ కుట్రలతో జాగ్రత్త: సీఎం చంద్రబాబు

AP: YS జగన్ కుట్రల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలను CM చంద్రబాబు హెచ్చరించారు. గతంలో వివేకా హత్య, కోడికత్తి డ్రామాల నెపం TDPపైన వేశారని వివరించారు. అప్పుడు అప్రమత్తంగా లేకపోవడంతో ఎన్నికల్లో నష్టపోయామని, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఈ కుట్రలను పసిగట్టలేకపోయిందని పేర్కొన్నారు. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలోనూ కుట్ర ఉందని, పోలీసులు CC ఫుటేజ్ అడిగినా ఇవ్వలేదని చెప్పారు.
Similar News
News February 28, 2025
రోజంతా కూర్చొని పనిచేస్తున్నారా?

ప్రస్తుతం చాలా మంది ఒకేచోట 9-12 గంటలు కూర్చొని పనిచేయాల్సి వస్తోంది. అయితే, ఇలా ఎక్కువసేపు కూర్చోవడం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ అధ్యయనంలో వెల్లడైంది. వీరిలో చిత్తవైకల్యం, స్ట్రోక్, ఆందోళన, నిరాశతో పాటు నిద్రలేమి సమస్యలొస్తాయని పేర్కొంది. ఇలాంటి జాబ్స్ చేసేవారు శారీరక వ్యాయామం చేయడం వల్ల ఈ ప్రమాదాల నుంచి బయటపడొచ్చని సూచించింది. ఈ అధ్యయనంలో 73,411 మంది పాల్గొన్నారు.
News February 28, 2025
శివరాత్రి వేళ రూ.కోటి దాటిన రాజన్న ఆలయ ఆదాయం

మహాశివరాత్రి రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రూ.1.31 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల ద్వారా రూ.57.12లక్షల ఆదాయంరాగా కోడె మెుక్కుల ద్వారా రూ.45.83లక్షలు వచ్చిందని పేర్కొన్నారు. స్వామివారిని 2లక్షల 60 వేల మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి భక్తులు ఆలయానికి తరలివచ్చారు.
News February 28, 2025
ALERT.. రేపటి నుంచి జాగ్రత్త

AP: విజయవాడ కమిషనరేట్ పరిధిలో రేపటి నుంచి కొత్త వాహన రూల్స్ అమల్లోకి రానున్నాయి. హెల్మెట్ లేకుండా బైక్ నడిపే వారికి, వెనుక కూర్చొని పెట్టుకోని వారికి, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడింగ్‌కు ₹1000, ఇన్సూరెన్స్ లేకపోతే ₹2000(తొలిసారి), రెండోసారి ₹4000, లైసెన్స్ లేకుండా బండి నడిపితే ₹5000, పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వారికి ₹1500, ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే ₹1500 ఫైన్ వేస్తామని పోలీసులు హెచ్చరించారు.