News July 7, 2024

ఈ లోన్ యాప్‌తో జాగ్రత్త: ప్రభుత్వం

image

ఆన్‌లైన్‌లోని లోన్ యాప్‌ల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. తాజాగా ‘క్యాష్‌ ఎక్స్‌పాండ్-యూ’ (CashExpand-U Finance Assistant) అనే లోన్ యాప్‌ను ప్లే స్టోర్‌ నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఈ యాప్ నకిలీదని, ఎవరైనా దీనిని డౌన్‌లోడ్ చేసుకుని ఉంటే వెంటనే ఫోన్ నుంచి తొలగించాలని తెలిపింది. తద్వారా వినియోగదారుల కీలక సమాచారం దుర్వినియోగం కాకుండా ఉంటుందని పేర్కొంది.

Similar News

News October 29, 2025

ఆర్థిక పొదుపు.. తెలివిగా ఆలోచించు!

image

మెరుగైన భవిష్యత్తు కోసం ఆర్థిక నిర్వహణ అత్యవసరం. ప్రతి నెల ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా క్రెడిట్ కార్డు అప్పులను త్వరగా తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఊహించని ఖర్చుల కోసం కనీసం 3-6 నెలల జీవన వ్యయానికి సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం తెలివైన పని. ఈ అలవాట్లు స్థిరమైన ఆర్థిక భద్రతను అందిస్తాయి’ అని చెబుతున్నారు.

News October 29, 2025

వరి పంట.. గింజ గట్టిపడే దశలో ఉంటే ఏం చేయాలి?

image

గింజ గట్టిపడే దశలో వరి పంట ఉంటే.. ముందుగా పొలంలో నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. గింజలో నిద్రావస్థ తొలగి నిలబడి ఉన్న. పడిపోయిన చేలలో మొలక వచ్చే అవకాశం ఉంది. కోత దశలో లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనబడితే, 5% ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పును లీటరు నీటికి కలపాలి) కలిపి పిచికారీ చేస్తే మొలకెత్తడాన్ని, రంగు మారడాన్ని నివారించవచ్చని ఏపీ వ్యవసాయశాఖ తెలిపింది.

News October 29, 2025

మహిళలు ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది ఇందుకే!

image

తాను పనిచేస్తుంటే హెల్ప్ చేయకుండా ఫోన్ చూస్తూ విశ్రాంతి తీసుకుంటున్న భర్తను చూసి మహిళలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. ఇది ఉద్యోగం కంటే కూడా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుందని తేలింది. ఇంటి పనులు, వంట, పిల్లల సంరక్షణతో మహిళల్లో కార్టిసాల్ (ఒత్తిడి హార్మోన్) స్థాయులు పెరుగుతాయి. ఇది సోమరితనం కాదని, బాధ్యతల్లో అసమతుల్యత అని నిపుణులు చెబుతున్నారు. *ఇంట్లో భార్యకు హెల్ప్ చేయండి బాస్