News April 5, 2024
నేడు, రేపు జాగ్రత్త!

TS: రాష్ట్రంలో ఇవాళ, రేపు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదవుతాయని తెలిపింది. ఉ.11 నుంచి మ.3 వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని సూచించింది. నిన్న నల్గొండ(D) ఇబ్రహీంపేటలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, 2016 తర్వాత ఈ ఏడాదే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని పేర్కొంది.
Similar News
News January 18, 2026
నితీశ్ కుమార్ రెడ్డికి మంచి ఛాన్స్..

వరుస ఫెయిల్యూర్స్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కీలక వికెట్లు కోల్పోగా.. విరాట్, నితీశ్ క్రీజులో ఉన్నారు. భారత్ మ్యాచ్ గెలవాలంటే వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం తప్పనిసరి. మరి నితీశ్ అనుభవజ్ఞుడైన కోహ్లీతో కలిసి రాణిస్తారా? కామెంట్ చేయండి.
News January 18, 2026
చేతబడి వల్లే నా భార్య మృతి: నటి భర్త

నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతిపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘షెఫాలీపై ఎవరో రెండుసార్లు చేతబడి చేశారు. తొలిసారి తప్పించుకున్నాం. కానీ రెండోసారి మరింత ఎక్కువగా చేశారు. ఎవరు, ఎందుకు, ఎలా చేశారనేది నాకు తెలియదు. కానీ ఏదో తప్పుగా జరిగిందని మాత్రం చెప్పగలను’ అని అన్నారు. గతేడాది జూన్ 27న షెఫాలీ చనిపోయారు. అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట, వెంకీ మామ చిత్రాల్లో పరాగ్ త్యాగి నటించారు.
News January 18, 2026
టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

న్యూజిలాండ్‌తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.


