News May 3, 2024
LS ఎన్నికలకు మించి.. ప్రజ్వల్ వీడియోల కోసమే వెతుకులాట

కర్ణాటకలో JDS MP ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోల ఉదంతం దేశంలో సంచలనంగా మారింది. APR 29 నుంచి మే 2 వరకు నెటిజన్లు లోక్‌సభ ఎన్నికలు, మోదీ, రాహుల్ గాంధీ కంటే ఎక్కువగా ఆయన వీడియోల గురించే గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నట్లు తేలింది. Xలోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ వీడియోల కోసం వెతుకుతున్న వారిలో కర్ణాటక, గోవా, TG, మహారాష్ట్ర, ఢిల్లీ, సిక్కిం, మిజోరం, నాగాలాండ్, AP, బిహార్ ప్రజలు టాప్‌లో ఉన్నారట.
Similar News
News November 4, 2025
కార్తీక మాసం: దీపాలెందుకు పెడతారు?

శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పవిత్ర కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. కార్తీక మాసంలో ఇతర మాసాలతో పోల్చితే సూర్యకాంతి తక్కువగా ఉంటుంది. అందువల్ల దట్టమైన చీకటి కమ్ముకుంటుంది. త్వరగా సూర్యాస్తమయం అవుతుంది. ఆ చీకటి నిస్సత్తువకు కారణమవుతుంది. అందుకే ఆ చీకటిని పాలద్రోలడానికి, మనలో శక్తిని పెంపొందించుకోవడానికి కార్తీకంలో ప్రతి గుమ్మం ముందు, గుళ్లలో దీపాలు పెడతారు.
News November 4, 2025
న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్‌లో 405 పోస్టులు

హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్(<
News November 4, 2025
రబీలో వరికి బదులు ఆరుతడి పంటలతో లాభాలు

రబీ కాలంలో వరి కన్నా ఆరుతడి పంటల సాగుకు అవసరమయ్యే నీరు, విద్యుచ్ఛక్తి, పెట్టుబడి తక్కువగా ఉంటుంది. ఎకరం వరి సాగుకు అవసరమయ్యే నీటితో కనీసం 2 నుంచి 8 ఎకరాల విస్తీర్ణంలో ఆరుతడి పంటలను సాగు చేయవచ్చు. పంట మార్పిడి వల్ల పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు తగ్గుతాయి. నిత్యావసరాలైన పప్పులు, నూనె గింజలు, కూరగాయల కొరత తగ్గుతుంది. పప్పు ధాన్యపు పంటలతో పంట మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది.


