News October 31, 2024

‘ఇంతకు మించి’.. చైనా సమస్యపై రాజ్‌నాథ్ కీలక వ్యాఖ్యలు

image

LAC వద్ద భారత్, చైనా సైనికుల ఉపసంహరణ దాదాపుగా ముగిసిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. డ్రాగన్ కంట్రీతో ‘ఇంతకు మించి’ పరిష్కారాలను కోరుకుంటున్నామని, అందుకు కాస్త సమయం పడుతుందని వెల్లడించారు. అరుణాచల్‌‌లోని తవాంగ్‌లో ఆయన సర్దార్ పటేల్ జయంతి, దీపావళిని సైనికులతో కలిసి జరుపుకున్నారు. మేజర్ బాబ్ ఖాథింగ్ శౌర్య మ్యూజియాన్ని ఆరంభించారు. ఈశాన్య భారతం భద్రతకు ఆయనెంతగానో కృషి చేశారని గుర్తుచేశారు.

Similar News

News October 31, 2024

రోడ్లపై బాణసంచా పేల్చడం నిషేధం

image

TG: దీపావళి సందర్భంగా పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పేల్చాలని చెప్పారు. ఆ తర్వాత పేల్చినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ నిబంధనలు నేటి నుంచి వచ్చే నెల 2 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

News October 31, 2024

జుట్టు, చర్మం, గోళ్లను అందంగా మార్చే ‘బయోటిన్’

image

ఆరోగ్యానికి ఆహారమే ప్రధానం. అందులోంచే శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ అందుతాయి. పొల్యూషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ సహా అనేక కారణాలతో జుట్టు ఊడిపోతుంది. గోళ్లు పెళుసుగా మారతాయి. చర్మం నిగారింపు కోల్పోతుంది. బయోటిన్ ఈ మూడింటినీ పరిష్కరిస్తుందని స్టడీస్ పేర్కొంటున్నాయి. ప్రతిరోజూ విటమిన్ సీ, జింక్‌తో కలిపి దేహానికి బయోటిన్ అందేలా మీల్స్ ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నాయి.

News October 31, 2024

కర్రలతో కొట్టుకొనే స్థితి నుంచి స్వీట్లు తినిపించుకొనే స్థాయికి..

image

భారత్, చైనా దౌత్యనీతిలో టెక్టానిక్ షిఫ్ట్ వచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కలవడం కష్టమే అనుకుంటే మిత్రబంధం ఒక్కసారిగా మెరుగైంది. కొవిడ్ టైమ్‌లో గల్వాన్‌లో చైనీయులను భారత జవాన్లు తరిమికొట్టారు. పిడిగుద్దులు, కర్రలు, రాడ్లతో చుక్కలు చూపించారు. ఇప్పుడు డిస్‌ఎంగేజ్‌మెంట్ ఒప్పందం కుదరడంతో స్వీట్లు తినిపించి జైశ్రీరామ్ అనిపించారు. భారత్ ఇదే ధోరణిలో సరిహద్దు సమస్యను పూర్తిగా పరిష్కరించుకోనుందా? మీ కామెంట్.