News December 5, 2024

BGT: రెండో టెస్టుకు బోలాండ్

image

భారత్‌తో రెండో టెస్టు(పింక్ బాల్)కు పేసర్ స్కాట్ బోలాండ్‌ను ఎంపిక చేసినట్లు కెప్టెన్ కమిన్స్ తెలిపారు. తొలి టెస్టులో గాయపడ్డ హెజిల్‌వుడ్ స్థానంలో బోలాండ్‌ను తీసుకున్నట్లు చెప్పారు.
AUS జట్టు: ఖవాజా, మెక్‌స్వీని, లబుషేన్, స్మిత్, హెడ్, మార్ష్, కేరీ, కమిన్స్, స్టార్క్, లయన్, బోలాండ్

Similar News

News March 16, 2026

అనకాపల్లి టెన్త్ విద్యార్థులారా.. మీకు ఫ్రీ బస్

image

జిల్లాలో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ అధికారిణి) వి.ప్రవీణ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం నుంచి విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చునని అన్నారు. పల్లె వెలుగు, ఆల్ట్రా డీలక్స్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో అవకాశాన్ని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు.

News March 16, 2026

ఆగిన ఎగుమతులు.. కుప్పకూలిన అరటి ధరలు

image

AP: పశ్చిమాసియాలో యుద్ధంతో అరటి రైతులు కుదేలవుతున్నారు. గల్ఫ్ దేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో 2 వారాల్లోనే వారి జీవితాలు తలకిందులయ్యాయి. ఈ నెల ఆరంభంలో టన్ను ధర రూ.20-23వేలు ఉండగా ప్రస్తుతం రూ.6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ కొనడానికి వ్యాపారులు ముందుకు రావట్లేదని అన్నదాతలు వాపోతున్నారు. వార్ ఇలాగే కొనసాగితే రేట్లు మరింత పతనమవుతాయని అంచనా. రాయలసీమలో దాదాపు లక్ష ఎకరాల్లో అరటి సాగవుతుంది.

News March 16, 2026

ఆస్కార్-2026 విజేతలు..

image

*ఉత్తమ సహాయ నటి – ఎమీ మ్యాడిగన్(వెపన్స్)
*బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – కెపాప్ డిమోన్ హంటర్స్ (మ్యాగీ కాంగ్, క్రిస్ అపెల్హాన్స్, మిషెల్లీ వాంగ్)
*బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ది గర్ల్ హూ క్రైడ్ పర్ల్స్(క్రిస్ లావిస్, మసీక్ జెజెర్బోవ్‌స్కీ)
*బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – కేట్ హాలే(ఫ్రాంకెన్‌స్టైన్)
*మేకప్ & హెయిర్ స్టైల్ – మైక్ హిల్, జోర్డాన్ శామ్యూల్, క్లియోనా ఫ్యురే (ఫ్రాంకెన్‌స్టైన్)