News November 22, 2024
BGT తొలి టెస్టు: అశ్విన్, జడేజా ఆడట్లేదా?
మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతున్న BGT తొలి టెస్టులో భారత్ బౌలింగ్ కాంబినేషన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశముంది. అశ్విన్, జడేజాను కాదని సుందర్ వైపు టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇటీవల NZ సిరీస్లో సుందర్ 2 మ్యాచుల్లో 16 వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. ఇక పేసర్లుగా బుమ్రా, సిరాజ్, రాణా, నితీశ్ ఆడనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 22, 2024
కాస్కో రేవంత్: బీఆర్ఎస్
TG: లగచర్ల గ్రామస్థుల అరెస్టుకు నిరసనగా తాము <<14666575>>మహబూబాబాద్లో<<>> చేపట్టనున్న నిరసనకు హైకోర్టు అనుమతిచ్చిందని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘కాస్కో రేవంత్. నువ్వెన్ని ఆంక్షలు పెట్టినా పేద దళిత, గిరిజన, ఆది వాసీ ప్రజల పక్షాన నిలబడతాం. న్యాయం జరిగే వరకు పోరాడతాం’ అని పేర్కొంది. ఈనెల 25న ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 1000 మందితో ధర్నా చేసుకోవచ్చని బీఆర్ఎస్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
News November 22, 2024
భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి పేరు: సీఎం చంద్రబాబు
AP: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు. విమానాశ్రయం పక్కన అల్లూరి స్మారక మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే పార్లమెంటులో అల్లూరి, ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టాలని అనుకున్నామని చెప్పారు. అవసరమైతే దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని తెలిపారు.
News November 22, 2024
వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ సమావేశాలు
TG: అసెంబ్లీ శీతాకాల సమావేశాలను డిసెంబర్ 9 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారం నుంచి పది రోజులపాటు ఈ సమావేశాలు జరగనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై చర్చించిన అనంతరం సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని CM రేవంత్ ఆవిష్కరించనున్నారు. DEC 7 నాటికి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఆలోగా క్యాబినెట్ విస్తరణను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.