News November 27, 2024
BGT: రెండో టెస్టుకూ గిల్ దూరం?
చేతి వేలి గాయంతో BGT తొలి టెస్టుకు దూరమైన భారత బ్యాటర్ గిల్ రెండో టెస్టులోనూ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. 10-14 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని అతడికి మెడికల్ స్పెషలిస్ట్ సూచించినట్లు BCCI వర్గాలు తెలిపాయి. రెండో టెస్టుకు ముందు జరిగే ప్రాక్టీస్ మ్యాచులో అతను అందుకే ఆడటం లేదని పేర్కొన్నాయి. థంబ్ ఫింగర్ ఇంజూరీ నుంచి కోలుకుని ఆడేందుకు టైమ్ పడుతుందని, మూడో టెస్టులోనూ ఆడేది అనుమానమేనని పేర్కొన్నాయి.
Similar News
News November 27, 2024
‘తనిఖీలు లేకే సోషల్ మీడియాలో వల్గర్ కంటెంట్’
సోషల్ మీడియాలో ‘వల్గర్ కంటెంట్’ నియంత్రణకు కఠిన చట్టాలు అవసరమని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కంటెంట్ సరైందో కాదో తనిఖీ చేసే ఎడిటోరియల్ బృందాలు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సోషల్ మీడియా ఓవైపు బలమైన మాధ్యమంగా మారింది. మరోవైపు నియంత్రణ లేక వల్గర్ కంటెంట్ వస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే మన సంస్కృతి చాలా భిన్నమైంది, సున్నితమైంది. PSCలు దీనిపై చర్చించాలి’ అని అన్నారు.
News November 27, 2024
భారత్పై ప్రధానికి ఉన్న ప్రేమ స్ఫూర్తిదాయకం: పవన్ కళ్యాణ్
AP: తనను కలిసేందుకు సమయం కేటాయించినందుకు PM మోదీకి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలిపారు. ‘పార్లమెంట్ సెషన్లతో బిజీగా ఉన్నా నాకు సమయం కేటాయించిన ప్రధానికి కృతజ్ఞతలు. గాంధీనగర్లో తొలిసారి భేటీ నుంచి ఇప్పటి వరకు కలిసిన ప్రతిసారీ ఆయనపై అభిమానం మరింత పెరుగుతుంటుంది. భారత్ పట్ల ఆయనకున్న ప్రేమ, నిబద్ధత స్ఫూర్తిదాయకం. థాంక్యూ సర్’ అని పేర్కొన్నారు.
News November 27, 2024
BREAKING: రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం
గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని AP ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నార్కోటిక్స్ నియంత్రణపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో మంత్రి లోకేశ్ ఈ నిర్ణయం ప్రకటించారు. యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్కు ఈగల్గా నామకరణం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీటిల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లను భాగస్వామ్యం చేయాలన్నారు.