News November 17, 2024
BGT: తొలి టెస్టుకు తుది జట్టు ఇదేనా?

BGTలో తొలి టెస్టు ఆరంభానికి మరో 5 రోజులు ఉంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగడం లేదని తెలుస్తోంది. వీరి స్థానంలో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ జట్టులో చోటు దక్కించుకుంటారని టాక్. జైస్వాల్‌తో కలిసి సుదర్శన్ ఇన్నింగ్స్ ఆరంభించే ఛాన్స్ ఉంది. ప్రాబబుల్ జట్టు: జైస్వాల్, సుదర్శన్, కోహ్లీ, రాహుల్, పంత్, జురెల్/నితీశ్, అశ్విన్, జడేజా, బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్
Similar News
News February 17, 2026
గుడ్‌న్యూస్.. వారికీ ఇందిరమ్మ ఇళ్లు!

TG: ఉమ్మడి APలో, గత ప్రభుత్వంలో ఇళ్ల నిర్మాణం పూర్తికాని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి ఇందిరమ్మ ఇళ్ల కింద సాయం చేయాలని నిర్ణయించింది. గతంలో ఇళ్లు మంజూరై బేస్‌మెంట్ దాకా కట్టగానే ప్రభుత్వాలు మారడంతో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఇలాంటి వాళ్లు 9 వేల మంది వరకు ఉన్నారని తేలింది. బేస్‌మెంట్ ఖర్చు రూ.లక్ష మినహాయించి, మిగతా రూ.4 లక్షల దాకా ప్రభుత్వం వారికి అందజేయనుంది.
News February 17, 2026
అధిక మాసంలో ఏమేం చేయవచ్చు?

అధిక మాసాన్నే పురుషోత్తమ మాసం అంటారు. ఇది ఆధ్యాత్మిక సాధనకు మహత్తర సమయం. ఈ మాసానికి విష్ణువు అధిపతి. అందుకే జపతపాలు, ధ్యానానికి ప్రాధాన్యం. ఆయన నామస్మరణతో కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. ఆత్మదర్శనానికి, భగవంతుని స్మరించడానికి ఇది అనుకూలమైన కాలం. ఈ మాసంలో శక్తి మేరకు అన్నదానం, విద్యాదానం చేయడం విశేష పుణ్యప్రదం. కొత్త శుభకార్యాలు నిషిద్ధమైనా, నిరంతర భగవన్నామ స్మరణతో, దానధర్మాలతో దైవకృపను పొందవచ్చు.
News February 17, 2026
ఆముదం పంటకు దాసరి పురుగు ముప్పు.. ఎలా నివారించాలి?

‘దాసరి పురుగు’లు ఆముదం పంటకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి పంటను ఆశించిన తొలిదశలో ఆకులను గోకి తర్వాత రంధ్రాలు చేసి ఆకులన్నీ తింటాయి. పురుగు ఉద్ధృతి ఎక్కువైతే మొక్క యొక్క లేత కొమ్మలను, కాడలను, పెరిగే కాయలను తిని పంటను తీవ్రంగా దెబ్బతీస్తాయి. దాసరి పురుగుల నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ కలిపి పంటపై పిచికారీ చేయాలి.


