News November 17, 2024

BGT: నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేస్తారని తెలుస్తోంది. ఇన్నింగ్స్ చివర్లో మెరుపులు మెరిపించగల సత్తా ఉండటంతో మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో ఆయనను తుది జట్టులో ఆడిస్తారని వార్తలు వస్తున్నాయి. నితీశ్‌తోపాటు దేవదత్ పడిక్కల్ లేదా సాయి సుదర్శన్‌లలో ఒకరు డెబ్యూ చేస్తారని టాక్.

Similar News

News January 12, 2026

‘జన నాయగన్’పై SCని ఆశ్రయించిన నిర్మాత

image

జన నాయగన్ మూవీకి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలన్న సింగిల్ బెంచ్ ఆదేశాలను నిలిపివేస్తూ HC ఇచ్చిన తీర్పుపై మూవీ నిర్మాత SCని ఆశ్రయించారు. CBFC చెన్నై విభాగం ముందు U/A సర్టిఫికెట్‌కు నిర్ణయించగా ఛైర్మన్ రివైజింగ్ కమిటీకి పంపారు. సింగిల్ బెంచ్ దీన్ని తిరస్కరించి సర్టిఫికెట్ ఇవ్వాలంది. ఆ తీర్పును CBFC అప్పీలుతో డివిజన్ బెంచ్‌ నిలిపివేసి విచారణను JAN 20కి వాయిదా వేసింది. నిర్మాత దీన్ని SCలో సవాల్ చేశారు.

News January 12, 2026

సుందర్‌ స్థానంలో బదోని

image

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గాయపడి సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనిని బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో వన్డేకు ఆయన జట్టులో చేరనున్నారు. సుందర్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. లిస్ట్-ఏ క్రికెట్‌లో బదోని 27 మ్యాచుల్లో 693 రన్స్ చేయగా అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే గాయంతో పంత్ ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.

News January 12, 2026

ఐఏఎస్‌ల బదిలీలు, పోస్టింగ్‌లు

image

ఏపీలో 14మంది IASలను బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రటరీగా గోపాలకృష్ణ, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్‌గా నుపుర్ అజయ్ కుమార్, ప్రకాశం జిల్లా JCగా కల్పనకుమారి, గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా మయూర్ అశోక్, తిరుపతి JC, తుడా వైస్ ఛైర్మన్‌గా గోవిందరావు, కడప JCగా నిధి మీన, అనంతపురం JCగా విష్ణుచరణ్, అనకాపల్లి JCగా సూర్యతేజ, చిత్తూరు JCగా ఆదర్శ్ రాజేంద్రన్.