News November 22, 2024
BGT: తొలి సెషన్ ఆసీస్‌దే
భారత్‌తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఫస్ట్ డే తొలి సెషన్లో పైచేయి సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బ్యాటర్లు ఆసీస్ బౌలింగ్‌కు బెంబేలెత్తారు. కనీసం బాల్‌ను టచ్ చేయడానికే కష్టపడ్డారు. దీంతో జైస్వాల్, పడిక్కల్ డకౌట్ అయ్యారు. కోహ్లీ 5 రన్స్‌తో నిరాశపరిచారు. రాహుల్ కాస్త మెరుగ్గా ఆడినా చివరికి 26 రన్స్ వద్ద వెనుదిరిగారు. దీంతో ఫస్ట్ సెషన్ ముగిసేసరికి IND 51రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది.
Similar News
News November 22, 2024
జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత
టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. టెస్టు చరిత్రలోనే అత్యుత్తమ యావరేజ్ కలిగిన రెండో బౌలర్‌గా ఆయన నిలిచారు. 41 మ్యాచుల్లో 177 వికెట్లు తీసి 20.17 యావరేజ్ కలిగి ఉన్నారు. అగ్ర స్థానంలో సిడ్నీ బార్న్స్ (16.43) ఉన్నారు. వీరిద్దరి తర్వాత అలెన్ డేవిడ్సన్ (20.53), మాల్కమ్ మార్షల్ (20.94), జోయల్ గార్నర్ (20.97) కొనసాగుతున్నారు.
News November 22, 2024
ఆ విషయంలో కూటమి పార్టీల నేతలు గప్‌చుప్
సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల లంచాల వ్యవహారంలో అదానీపై అమెరికా దర్యాప్తు సంస్థల ఆరోపణలపై APలో టీడీపీ, జనసేన, BJP కూటమి మౌనంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే అదానీ నుంచి జగన్ రూ.1,750 కోట్ల లంచాలు తీసుకున్నట్టు కూటమి అనుకూల వేదికలు ఈ వ్యవహారంపై పెద్దఎత్తున ప్రచారం చేశాయి. మోదీ-అదానీల మధ్య ఉన్న బంధం వల్లే కూటమిలోని పార్టీల నేతలు ఈ వ్యవహారంలో నేరుగా స్పందించడం లేదనే చర్చ జరుగుతోంది.
News November 22, 2024
OTTలోకి కొత్త సినిమా
కేజీఎఫ్, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలు తీసిన ప్రశాంత్ నీల్ అందించిన స్టోరీతో వచ్చిన మూవీ ‘బఘీరా’. అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం నిన్న ఓటీటీలోకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా కన్నడలో రూ.29 కోట్లు వసూలు చేసింది. తెలుగులో నిరాశపర్చింది.