News November 22, 2024

BGT: ఫ్రీగా ఎక్కడ చూడాలంటే?

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య తొలి టెస్టు మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్‌తోపాటు హాట్ స్టార్‌లో కూడా వీక్షించవచ్చు. స్థానిక భాషల్లోనూ మ్యాచ్ లైవ్ అవుతుంది. కాకపోతే ఈ ఛానళ్లను సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. డీడీ స్పోర్ట్స్‌లో ఫ్రీగా చూడవచ్చు. ఇందుకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు.

Similar News

News January 25, 2026

కొచ్చిన్ యూనివర్సిటీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>కొచ్చిన్<<>> యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ 5 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు ఫిబ్రవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్ (నావల్ ఆర్కిటెక్చర్&షిప్ బిల్డింగ్, ఓషియన్ ఇంజినీరింగ్, మెరైన్ ఇంజినీరింగ్) , MTech, PhD ఉత్తీర్ణులు అర్హులు. PhD హోల్డర్లకు నెలకు రూ.42,000, టీచర్లకు రూ.40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://recruit.cusat.ac.in

News January 25, 2026

రంగులు మారే గణపతి ఆలయం.. ఎక్కడంటే?

image

TN కేరళపురంలో శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్ ఆలయం అందర్నీ అబ్బురపరుస్తోంది. ఇక్కడి వినాయక విగ్రహం ఉత్తరాయణంలో నలుపు, దక్షిణాయనంలో తెలుపు రంగులో దర్శనమిస్తుంది. ఇక్కడి బావి నీరు కూడా విగ్రహానికి వ్యతిరేక రంగులోకి మారుతుంటాయి. ఆలయ ప్రాంగణంలోని మర్రిచెట్టు కూడా కాలానుగుణంగా ఆకు రాల్చడం, చిగురించడం వంటి వింతలు ప్రదర్శిస్తుంది. 12వ శతాబ్దపు ఈ పురాతన గుడి మిరాకిల్ వినాయకర్‌గా భక్తులను ఆకర్షిస్తోంది.

News January 25, 2026

‘మన్ కీ బాత్‌’లో అనంతపురం ప్రస్తావన

image

AP: ‘మన్ కీ బాత్‌’లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని అనంతపురం గురించి ప్రస్తావించారు. నీటి ఎద్దడి పరిష్కారానికి అక్కడి ప్రజల శ్రమను అభినందించారు. ఏపీ ప్రభుత్వ సహకారంతో పదికి పైగా జలాశయాలను పునరుద్ధరించారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో 7 వేలకు పైగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు బాటలు వేశారని పొగిడారు. కాగా ప్రధాని మోదీ 130వ ‘మన్ కీ బాత్’లో ఈరోజు మాట్లాడారు.