News March 22, 2024
25న భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

TG: భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం పనులకు మార్చి 25న శ్రీకారం చుట్టనున్నారు. ఉత్తర ద్వారం వద్ద ప్రత్యేక పూజలు చేసి, పసుపు కొమ్ములు దంచుతారు. అలాగే తలంబ్రాలు కలిపే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల మేర తలంబ్రాలు కలిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తుండగా.. నవమి రోజున వీటిని భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఏప్రిల్ 17న శ్రీరామనవమి, 18న పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.
Similar News
News April 6, 2026
‘లాకప్ డెత్’.. అప్పట్లో దేశాన్ని కుదిపేసిన కేసు

TNలోని మదురై <<19583236>>కోర్టు<<>> తీర్పుతో లాకప్‌డెత్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. లాక్‌డౌన్‌లో షాప్స్ త్వరగా మూసివేయిస్తున్నారని జయరాజ్ చేసిన విమర్శతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రశ్నించిన కొడుకునీ లాకప్‌లో వేసి హింసించడంతో వారు చనిపోయారు. దీనిని పోలీసులు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించగా నిరసనలు చెలరేగడంతో కేసును CBI టేకోవర్ చేసింది. ఐదేళ్లలో 100 మందికిపైగా సాక్షులను విచారించి కోర్టు ఈ తీర్పునిచ్చింది.
News April 6, 2026
‘అమృత్’ స్కీమ్‌లోకి పిఠాపురం.. థాంక్స్ చెప్పిన పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించిందని, ఆయన అభ్యర్థన మేరకు ‘అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్’ పరిధిలోకి పిఠాపురం రైల్వే స్టేషన్‌ను చేర్చారని Dy.CMO ట్వీట్ చేసింది. పథకంలో భాగంగా రూ.37.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారని తెలిపింది. దీంతో పిఠాపురం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
News April 6, 2026
పెళ్లి చేసుకొన్న మహిళా క్రికెటర్లు

మహిళా క్రికెటర్లు అమీ జోన్స్(ఇంగ్లండ్), పైపా క్లియరీ(ఆస్ట్రేలియా) పెళ్లి చేసుకొన్నారు. ఈ నెల 4న తమ వివాహం జరిగినట్లు వారు ఇన్‌స్టాలో పోస్టు చేశారు. 2024 జులైలో వారి ఎంగేజ్‌మెంట్ జరిగింది. అమీ 8 టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20లు, క్లియరీ 109 టీ20లు ఆడారు. కాగా గతంలోనూ పలువురు ఉమెన్ క్రికెటర్లు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకొన్న విషయం తెలిసిందే.


