News March 23, 2025

క్షమాపణల కంటే మరణాన్నే కోరుకున్న భగత్!

image

ఇంకెప్పుడూ హింసకు పాల్పడనని రాసిచ్చి క్షమాపణలు చెబితే వదిలేస్తామని బ్రిటిషర్లు భగత్‌సింగ్‌కు ఆఫర్ ఇచ్చారు. ‘వారికి క్షమాపణలు చెప్పడం కంటే చావే నాకు ఇష్టం’ అంటూ ఉరికంబాన్నే కోరుకున్నారాయన. ‘యంగ్ ఇండియా’ పుస్తకంలో గాంధీ భగత్ గురించి ప్రస్తావించారు. ‘భగత్ అసలు బతకాలని భావించలేదు. కనీసం అప్పీల్ కూడా చేయలేదు. <<15857764>>ఆ ముగ్గురూ<<>> మరణభయాన్ని జయించారు. ఆ ధీరత్వానికి మనం 1000సార్లు ప్రణమిల్లాలి’ అని రాసుకొచ్చారు.

Similar News

News November 28, 2025

పాత ఫొటోలకు కొత్త రూపం.. ట్రై చేయండి!

image

పాడైపోయిన, క్లారిటీ కోల్పోయిన చిన్ననాటి ఫొటోలను HD క్వాలిటీలోకి మార్చుకోవచ్చు. ‘జెమినీ AI’ను ఉపయోగించి అస్పష్టంగా ఉన్న చిత్రాలను అప్‌లోడ్ చేసి, సరైన ప్రాంప్ట్‌తో డిజిటల్ SLR నాణ్యతకు మార్చవచ్చు. ఇది గీతలు, మసకబారడం వంటి లోపాలను సరిచేస్తూ, రూపురేఖలను చెక్కుచెదరకుండా ఉంచి, మీ జ్ఞాపకాలను సజీవంగా అందిస్తుంది. ఈ <>ప్రాంప్ట్<<>> వాడి మీరూ ట్రై చేయండి.

News November 28, 2025

పీసీఓఎస్ ఉందా? ఇలా చేయండి

image

పీసీఓఎస్ ఉన్నవారిలో ప్రధాన సమస్య బరువు. ఎంత కడుపు మాడ్చుకున్నా, వ్యాయామాలు చేసినా బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. అలాంటివారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. పులియబెట్టిన ఆహారాలు, ఫైబర్, ప్రొటీన్ ఫుడ్స్ డైట్‌లో చేర్చుకోవాలి. అవకాడో, ఆలివ్‌ నూనె, కొబ్బరి నూనె, నట్స్‌.. వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. వీటితో పాటు వ్యాయామాలు, తగినంత నిద్ర ఉండాలి.

News November 28, 2025

2,757 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) 2,757 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఏ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా, టెన్త్, ఐటీఐ, ఇంటర్ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 18 వరకు NAPS/NATS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iocl.com