News March 18, 2025
భగవద్గీత నాకు బలాన్ని, శాంతిని ఇస్తుంది: తులసీ గబ్బార్డ్

భగవద్గీత తనకు ప్రశాంతతను, మనోస్థైర్యాన్ని ఇస్తుంటుందని అమెరికా నిఘా సంస్థల డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ అన్నారు. భారత పర్యటనలో ఉన్న ఆమె ANIతో ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘భారత్కు వస్తే సొంత ఇంటికి వచ్చినట్లుంటుంది. ప్రజలు ఎంతో సాదరంగా మాట్లాడుతారు. ఆహారం అత్యంత రుచికరంగా ఉంటుంది. నేను యుద్ధక్షేత్రంలో ఉన్న సమయంలో భగవద్గీత నాకు ఊరటనిచ్చేది’ అని వివరించారు. ఆమె హిందూమతాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News March 18, 2025
అలా చేస్తే పృథ్వీ షాను మించిన వారు లేరు: శశాంక్ సింగ్

ముంబై క్రికెటర్ పృథ్వీషాపై పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘షాతో నాకు 13ఏళ్ల పరిచయం. జైస్వాల్, గిల్ వంటివారు మంచి ఆటగాళ్లే. కానీ షా గనుక తిరిగి తన బ్యాటింగ్ బేసిక్స్ను గుర్తుతెచ్చుకుని ఆడితే తనను మించినవారు లేరు. కష్టం, ఫిట్నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్.. వీటి విలువ తెలుసుకుని తను గాడిలో పడాలి’ అని అభిలషించారు.
News March 18, 2025
నేటి నుంచే అంగన్వాడీల్లో ఒంటి పూట: మంత్రి

AP: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
News March 18, 2025
మంచు లక్ష్మి, కాజల్, రానాపై కేసుకు డిమాండ్!

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్రాజ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?