News April 12, 2024

భళా.. బదోని: లోయర్‌ ఆర్డర్‌లో వారియర్

image

ఆయుష్ బదోని(LSG) లోయర్ ఆర్డర్‌లో అదరగొడుతున్నారు. ఆ జట్టు తరఫున 6 లేదా దిగువన బ్యాటింగ్‌కు దిగి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన 5 సందర్భాల్లోనూ ఇతనే పార్ట్‌నర్. 2023లో పూరన్‌తో కలిసి 84, 74, 59 రన్స్, ఇవాళ అర్షద్‌తో కలిసి 73*, 2022లో KLతో కలిసి 47 రన్స్ చేశారు. అలాగే IPL హిస్టరీలో 8 లేదా దిగువ స్థానాల్లో రెండో అత్యధిక భాగస్వామ్యం(73*) నెలకొల్పిన జంటగా బదోని-అర్షద్ ఘనత సాధించారు.

Similar News

News November 16, 2024

జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూశా: సంజూ

image

SAపై నాలుగో T20లో సెంచరీ చేసిన అనంతరం సంజూ శాంసన్ కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో మాట్లాడుతూ ‘శ్వాస వేగంగా తీసుకుంటున్నా. మాట్లాడటం కష్టంగా ఉంది. జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్‌ను ఎదుర్కొన్నా. ఎంతో కష్టపడి ఇంత వరకు వచ్చా. ఈ సిరీస్‌లో ఓ సెంచరీ తర్వాత వరుసగా రెండుసార్లు డకౌట్ అయ్యా. దీంతో ఎన్నో విషయాలు నా తలలో తిరిగాయి. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్, తిలక్ నాకు హెల్ప్ చేశారు’ అని పేర్కొన్నారు.

News November 16, 2024

అప్పుడు ఫస్ట్ బాల్‌కే అవుట్ అయ్యా: తిలక్ వర్మ

image

సౌతాఫ్రికాపై నిన్న జరిగిన టీ20తో సహా సిరీస్‌లో 2సెంచరీలు చేసిన తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ఫ్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కించుకున్నారు. ఇది తనకు గొప్ప అనుభూతి అని, గతేడాది ఇక్కడ తొలి బంతికే అవుట్ అయినట్లు చెప్పారు. సౌతాఫ్రికాలోని ఛాలెంజింగ్ కండీషన్లలో 2సెంచరీలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మరోవైపు, ఓ టీ20 సిరీస్‌లో MOTM, MOTS అవార్డులు అందుకున్న యంగెస్ట్ క్రికెటర్‌గా నిలిచారు.

News November 16, 2024

1,400 కళాఖండాలను తిరిగిచ్చిన అమెరికా

image

భారత్‌లో దొంగతనానికి గురై వివిధ మార్గాల ద్వారా తమ దేశానికి చేరిన 1,400కు పైగా కళాఖండాలు, వస్తువులను US తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఇందులో ఖగోళ నర్తకి ఇసుక రాయి శిల్పం అరుదైనదని, ఇది ఇండియా నుంచి లండన్‌కు, అక్కడి నుంచి US మ్యూజియంకు చేరిందని వెల్లడించింది. అక్రమ రవాణాదారుల నెట్‌వర్క్‌పై ఫోకస్ చేశామని, దీని వెనుక తమిళనాడుకు చెందిన సుభాష్ కపూర్ హస్తం ఉందని పేర్కొంది.