News March 21, 2025
రాష్ట్రంలో భానుడి భగభగలు

AP: రాష్ట్రంలో ఇవాళ ఎండలు మండిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాల జిల్లా చాగలమర్రిలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA తెలిపింది. కర్నూలు జిల్లా కోసిగిలో 40.6, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.2, వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట, అన్నమయ్య జిల్లా గాదెలలో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. మరోవైపు రేపు 18 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది.
Similar News
News March 22, 2025
ఏకాగ్రత కుదరటం లేదా? ఈ టిప్స్ పాటించండి

ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. సుడోకు, క్రాస్‌వర్డ్స్ వంటివి సాలో చేస్తూ ఉండండి. రోజూ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆలోచనలు భావాలను రాస్తూ ఉండండి. ఏదైనా ఒక విషయాన్ని విజువలైజేషన్ చేయండి. రోజూ వ్యాయామం చేయడం వల్ల బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. తద్వారా ఏకాగ్రత పెరుగుతుంది. మ్యూజిక్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. తద్వార మన ఫోకస్ పెంచవచ్చు.
News March 22, 2025
భాష పేరుతో రాజకీయం అందుకే? అమిత్ షా

కొన్ని రాజకీయ పార్టీలు తమ అవినీతిని కప్పి పెట్టడానికే భాష పేరుతో రాజకీయం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరోపించారు. సౌత్ ఇండియా భాషలను తాము వ్యతిరేకిస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారని అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తమిళనాడులో NDA కూటమి అధికారంలోకి వస్తే మెడిసిన్, ఇంజినీరింగ్ పాఠ్య పుస్తకాలను తమిళ భాషలోకి అనువదిస్తామని తెలిపారు.
News March 22, 2025
రోహిత్‌లా విరాట్ రిస్క్ తీసుకోలేరు: ఫించ్

దూకుడుగా ఆడేందుకు రోహిత్‌కు ఉన్న అవకాశం విరాట్‌కు లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఫించ్ అభిప్రాయపడ్డారు. టీమ్ పరిస్థితుల్ని బట్టి చూస్తే రోహిత్‌లా రిస్క్ తీసుకోలేరని పేర్కొన్నారు. ‘ముంబైలో రోహిత్ తర్వాత వచ్చే ఆటగాళ్లపై ఆయన స్కోరు ప్రభావం చూపించదు. అందుకే శర్మ స్వేచ్ఛగా ఆడతారు. కానీ ఆర్సీబీ జట్టు విరాట్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన స్కోర్ చేస్తేనే జట్టుకు మంచి పునాది లభిస్తుంది’ అని విశ్లేషించారు.