News December 30, 2024
మన్మోహన్కు భారతరత్న.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సీఎం రేవంత్ ప్రతిపాదనకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ఇక తీర్మానాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లనుంది. మరోవైపు అసెంబ్లీలో సభ్యులు సింగ్కు ఘనంగా నివాళి అర్పించారు.
Similar News
News December 16, 2025
BREAKING: భారత ప్లేయర్ విధ్వంసం.. డబుల్ సెంచరీ

U-19 ఆసియా కప్లో భాగంగా మలేషియాతో మ్యాచ్లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. అభిజ్ఞాన్ 121 బంతుల్లో డబుల్ సెంచరీ చేశారు. ఇందులో 16 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. 48వ ఓవర్లో అభిజ్ఞాన్, చౌహాన్ 29 పరుగులు బాదారు. వరుసగా 4, వైడ్, 6, 6, 6, వైడ్, 1, 4 రన్స్ వచ్చాయి.
News December 16, 2025
బీట్ రూట్ సాగులో కలుపు నివారణ ఎలా?

బీట్ రూట్లో కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి. విత్తిన 24-48 గంటల్లోపు ఎకరాకు తేలిక నేలల్లో 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 1.25 లీటర్లు, అదే బరువు నేలల్లో అయితే 200 లీటర్ల నీటిలో అలాక్లోర్ 1.25L కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో మెట్రిబుజిన్ 300 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. గింజ మొలకెత్తిన 20-25 రోజుల తర్వాత కలుపు తీసి మన్ను ఎగదోస్తే గడ్డ బాగా ఊరుతుంది.
News December 16, 2025
99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు: లోకేశ్

AP: అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ కంపెనీలన్నీ విశాఖకే వస్తున్నాయని తెలిపారు. CM CBN విజన్తో ముందుకెళ్తున్నారని చెప్పారు. భోగాపురంలో AAD ఎడ్యుసిటీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘కొంత మంది విజన్లెస్ మనుషులు విజనరీలను విమర్శిస్తారు. 99 పైసలకు భూములిస్తామంటే ఎగతాళి చేశారు. ఆ నిర్ణయంతోనే కాగ్నిజెంట్, TCS వచ్చాయి’ అని వెల్లడించారు.


