News December 29, 2024

రైతు భరోసా అమలుపై భట్టి అధ్యక్షతన భేటీ

image

TG: రైతు భరోసా విధివిధానాల ఖరారుపై సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల ద్వారా అభిప్రాయ సేకరణ జరిగిన సంగతి తెలిసిందే. సాగు భూములకే భరోసా అందించాలనే అంశంపై కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు ఎన్ని ఎకరాల లోపు వారికి ఇవ్వాలనే విషయమై ఖరారు చేయనుంది. సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేయనున్నట్లు సమాచారం.

Similar News

News January 1, 2025

2025లో మీ రెజల్యూషన్స్ ఏంటి?

image

కొత్త ఏడాదికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పేశాం. 2025లో మీరు ఏమైనా రెజల్యూషన్స్ పెట్టుకున్నారా? ఏదైనా సాధించాలని, ఉద్యోగం పొందాలని, జీతం పెరిగే ఉద్యోగం దొరకాలని, జీవితం మారాలని, పొదుపు చేయాలని, మందు, సిగరెట్ మానేయాలని, పెళ్లి చేసుకోవాలని, డైట్ ఫాలో కావాలని, జిమ్‌కు వెళ్లాలని, మందు తాగకూడదని, దూరమైన వారితో తిరిగి మాట్లాడాలని.. ఇలా మీ రెజల్యూషన్స్ ఏంటో? కామెంట్ చేయండి. వాటిని ఇవాళ్టి నుంచే ప్రారంభించండి.

News January 1, 2025

హైదరాబాద్‌లో 1184 డ్రంక్&డ్రైవ్ కేసులు

image

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత అర్ధరాత్రి 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఈస్ట్ జోన్‌లో అత్యధికంగా 236, సౌత్ ఈస్ట్ జోన్‌లో 192, వెస్ట్ జోన్‌లో 179, నార్త్ జోన్ 177, సెంట్రల్ జోన్ 102, సౌత్ వెస్ట్ జోన్‌లో 179 కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసిన సంగతి తెలిసిందే.

News January 1, 2025

రేపటి నుంచి టెట్ పరీక్షలు

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పరీక్షలు రేపటి నుంచి ఈనెల 20 వరకు జరగనున్నాయి. మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. పేపర్-1కు 94,327 మంది, పేపర్-2కు 1,81,426 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 17 జిల్లాల పరిధిలో 92 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉ.9 నుంచి ఉ.11.30 వరకు మొదటి సెషన్, మ.2-సా.4.30 వరకు రెండో సెషన్ నిర్వహించనున్నారు.