News April 25, 2024
కేరళలో భట్టి ఎన్నికల ప్రచారం

TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పాలఘాట్ జిల్లాలోని అలత్తూరు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రమ్య హరిదాస్ తరఫున ఆయన ప్రచారం చేశారు. అక్కడి ప్రజలతో మమేకమవుతూ ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కాగా భట్టికి పాల్ఘాట్ డీసీసీ అధ్యక్షుడు తంగప్పన్ ఘనస్వాగతం పలికారు.
Similar News
News November 9, 2025
బై పోల్.. ప్రచారానికి నేడే ఆఖరు

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచార పర్వం నేటితో ముగియనుంది. సాయంత్రం 6 గంటలకు మైకులు, ప్రచార రథాలు మూగబోనున్నాయి. ప్రచార గడువు ముగియనుండటంతో ఆయా పార్టీల నేతలు తమ ప్రత్యర్థులపై పదునైన మాటల తూటాలు సంధిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు ఇవాళ సా.6 నుంచి ఈ నెల 11(పోలింగ్ తేదీ) సా.6 గంటల వరకు నియోజకవర్గంలో వైన్స్ మూసివేయాలని HYD సీపీ సజ్జనార్ ఆదేశించారు.
News November 9, 2025
పాటీదార్కు గాయం.. 4 నెలలు ఆటకు దూరం!

భారత ప్లేయర్ రజత్ పాటీదార్ నాలుగు నెలల పాటు క్రికెట్కు దూరం కానున్నారని క్రీడావర్గాలు తెలిపాయి. సౌతాఫ్రికా-ఏతో జరిగిన తొలి అన్అఫీషియల్ టెస్టులో ఆయన గాయపడినట్లు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టులోనూ ఆడట్లేదని పేర్కొన్నాయి. ఈ కారణంతో ఈ నెలాఖరు, డిసెంబర్లో జరిగే దేశవాళీ టోర్నీలకు ఆయన దూరం కానున్నారు. మరోవైపు పాటీదార్ త్వరగా కోలుకోవాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
News November 9, 2025
శబరిమలకు ప్రత్యేక రైళ్లు.. ఇవాళ్టి నుంచి బుకింగ్

అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి SCR <<18224903>>మరిన్ని<<>> ప్రత్యేక రైళ్లు నడపనుంది. కాకినాడ టౌన్-కొట్టాయం, కొట్టాయం-కాకినాడ టౌన్, నాందేడ్-కొల్లామ్, కొల్లామ్-నాందేడ్, చర్లపల్లి-కొల్లామ్, కొల్లామ్-చర్లపల్లి మీదుగా 54 రైళ్లు నడపనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇవాళ ఉ.8 గంటల తర్వాత నుంచి ఈ రైళ్లకు సంబంధించిన బుకింగ్ ప్రారంభం కానుందని IRCTC వెల్లడించింది.


