News August 1, 2024
భట్టి గారు.. సత్యం తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది: కార్తీక్
TG: సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ డిప్యూటీ CM భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఆమె కుమారుడు కార్తీక్ Xలో స్పందించారు. ‘YSR మరణం తర్వాత మా అమ్మపై CBI కేసులు పెట్టించారు. 2014, 2018 ఎన్నికల్లో కుటుంబానికి ఒకటే టికెట్ అని చెప్పి మాకు అన్యాయం చేశారు. రాజకీయ సమాధి చేయాలని కాంగ్రెస్ వాళ్లే ప్రయత్నిస్తుంటే పార్టీ మారాము. సత్యం తెలుసుకుని భట్టి మాట్లాడితే బాగుంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News February 2, 2025
‘అమ్మానాన్నా.. నేను చనిపోతున్నా’
TG: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఏపీలోని అమలాపురానికి చెందిన యోగిత (15) చిన్నప్పటి నుంచి మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని అమ్మమ్మ వద్ద ఉంటోంది. టెన్త్ పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తుండటంతో సూసైడ్ చేసుకుంది. ‘ఎంత చదివినా మార్కులు రావడం లేదు. 10 జీపీఏ సాధించాలనుకుంటున్నా నా వల్ల కావట్లేదు. నేను చనిపోతున్నా. అమ్మానాన్నా క్షమించండి’ అని సూసైడ్ నోట్ రాసింది.
News February 2, 2025
జనవరిలోనే విద్యుత్ సెగలు.. రికార్డుస్థాయికి చేరిక
చలికాలం ఉండగానే TGలో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయికి చేరింది. JAN31న ఏకంగా 15,205 మెగావాట్లుగా(2024లో అదే రోజున 13K) నమోదైంది. ఇక వేసవిలో కరెంట్ డిమాండ్ 17K మెగావాట్లకు చేరుతుందని అధికారుల అంచనా. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 287 మి.యూ అయితే 160-165MU మాత్రమే ఉత్పత్తవుతోంది. మిగతాదంతా కొనుగోళ్ల ద్వారానే సమకూరుతోంది. డిమాండ్ నేపథ్యంలో అధిక ఉత్పత్తికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
News February 2, 2025
బ్యూటిఫుల్ ఫొటో: లెజండరీ టు యంగ్‌స్టర్స్
ముంబైలో BCCI అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. లెజెండరీ క్రికెటర్ సచిన్ CK నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా బుమ్రా పాలీ ఉమ్రిగర్, అశ్విన్ స్పెషల్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే పలు కేటగిరీల్లో స్మృతి, సర్ఫరాజ్, దీప్తి శర్మ, ఆశా శోభన, U-16, 23, దేశవాళీ ఆటగాళ్లకు పురస్కారాలు లభించాయి. వీరందరూ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటో ఆకట్టుకుంటోంది.