News August 24, 2024

నిర్మలా సీతారామన్‌తో భట్టి భేటీ

image

ఢిల్లీ పర్యటనలో ఉన్న TG Dy.CM భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా AP నుంచి TGకి రావాల్సిన నిధులు విడుదల చేసేలా చూడాలని కోరారు. మొత్తం 8 అంశాలను ఆమె దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారని భట్టి వివరించారు. త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కార మార్గం చూపిస్తామని నిర్మల చెప్పినట్లు పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

తుది శ్వాస వరకు సనాతన ధర్మం కోసం పనిచేస్తా: రాజాసింగ్

image

TG: తన <<17030713>>రాజీనామాను<<>> BJP ఆమోదించడంపై రాజాసింగ్ స్పందించారు. ‘ప్రజా సేవ చేసేందుకు, హిందుత్వాన్ని కాపాడేందుకు 11yrs క్రితం BJPలో చేరాను. నన్ను నమ్మి 3 సార్లు MLA టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. TGలో BJP ప్రభుత్వం రావాలని కార్యకర్తలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారి బాధేంటో ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యేలా చెప్పలేకపోయానేమో. తుది శ్వాస వరకు సనాతన ధర్మాన్ని రక్షించేందుకు పనిచేస్తా’ అని ట్వీట్ చేశారు.

News July 11, 2025

HCA అధ్యక్షుడే కీలక సూత్రధారి: CID

image

HCA అవకతవకల కేసు వ్యవహారంలో CID దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో రిమాండ్‌లో ఉన్న ఐదుగురిని కస్టడీలోకి ఇవ్వాలని మల్కాజ్‌గిరి కోర్టులో పిటిషన్ వేసింది. వారిని 10 రోజులపాటు విచారించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ‘HCAలో అక్రమాలు జరిగాయి. కమిటీ అధ్యక్షుడు జగన్మోహనే కీలక సూత్రధారి. BCCIతోపాటు IPL నుంచి వచ్చిన నిధులను దుర్వినియోగం చేశారు’ అని CID పేర్కొంది. ఈ పిటిషన్‌పై కోర్టు ఇవాళ విచారించనుంది.

News July 11, 2025

భారత్‌పై 11వ సెంచరీ బాదిన రూట్

image

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ENG స్టార్ బ్యాటర్ రూట్ సెంచరీతో చెలరేగారు. రెండో రోజు తొలి బంతికే ఫోర్ కొట్టి శతకం పూర్తి చేశారు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా స్మిత్ సరసన చేరారు. 60 ఇన్నింగ్స్‌లలో 11 సెంచరీలు చేశారు. మొత్తంగా 37 సెంచరీలు చేసి ద్రవిడ్, స్మిత్(36)ను అధిగమించి టాప్ 5లో నిలిచారు. మరోవైపు బుమ్రా బౌలింగ్‌లో స్టోక్స్(44) ఔటయ్యారు. ప్రస్తుతం ENG స్కోర్ 265/5.