News November 23, 2024

రాంచీలో భట్టి ‘రాజకీయం’

image

ఝార్ఖండ్‌లో పోస్ట్ రిజల్ట్స్ ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాంచీలో వాలిపోయారు. ఫలితాల సరళిని చూస్తే ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో కాసేపట్లో గెలుపు గుర్రాలతో భట్టి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమితో పోలిస్తే సీట్ల తేడా తక్కువగా ఉండటంతో JMM, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నారు.

Similar News

News December 27, 2024

దేశం గొప్ప నేతను కోల్పోయింది: ప్రధాని మోదీ

image

మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. అత్యంత గొప్ప నాయకుల్లో ఒకరైన నేతను దేశం కోల్పోయిందన్నారు. నిరాడంబరమైన మూలాల నుంచి ఎదిగి గౌరవనీయమైన ఆర్థికవేత్తగా ఎదిగారని కొనియాడారు. మన ప్రధానిగా ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆయన విస్తృతంగా కృషి చేశారని ప్రశంసించారు.

News December 27, 2024

మాటలు తక్కువ.. పని ఎక్కువ

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు చెప్పగానే ‘ఆయన అసలేం మాట్లాడరు’ అని అంతా అంటుంటారు. అవును నిజమే. చాలామంది రాజకీయ నేతల్లా ఆయన మాటలు చెప్పే వ్యక్తి కాదు. చేతల్లో పని చూపించే నేత. 1991 నుంచి 1996 వరకు దేశ ఫైనాన్స్ మినిస్టర్‌గా పనిచేసిన మన్మోహన్.. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన హయాంలోనే అత్యధిక జీడీపీ 10.2శాతం వృద్ధిరేటు నమోదైంది. వెనుకబడిన వర్గాలకు 27శాతం సీట్ల కేటాయింపు జరిగింది.

News December 27, 2024

ప్రజలకు ‘ఉపాధి’ కల్పించింది ఆయనే..

image

గ్రామీణ ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ప్ర‌జ‌ల‌కు పని క‌ల్పిస్తున్న ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌న్మోహ‌న్ సింగ్ హయాంలోనే ప్రారంభించారు. 1991లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ప్రధానిగా ఆయన కొనసాగించారు. తద్వారా విదేశీ పెట్టుబడులు, ప్రైవేటీకరణ, లైసెన్సింగ్ విధానాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికాతో అణు ఒప్పందం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, స‌మాచార హ‌క్కు చ‌ట్టం వంటి కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేశారు.