News July 18, 2024

రూ.2లక్షల పైన రుణాలపై భట్టి కీలక వ్యాఖ్యలు

image

TG: ఈనెలలోనే రెండో దఫా రూ.లక్షన్నర ఉన్న రుణాలు మాఫీ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇవాళ తొలి విడత రుణమాఫీ నేపథ్యంలో తాజాగా ఆయన బ్యాంకర్లతో మరోసారి భేటీ అయ్యారు. రూ.2లక్షలపైన రుణం ఉన్న రైతులతో మాట్లాడి రికవరీ చేసుకోవాలని బ్యాంకర్లకు సూచించారు. ఏ రైతూ రుణం బకాయి ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే చారిత్రక నిర్ణయమని భట్టి స్పష్టం చేశారు.

Similar News

News November 17, 2025

గొర్రె పిల్లలకు అందించే క్రీపు దాణా తయారీ నమూనా ఫార్ములా

image

100 కిలోల క్రీపు దాణా తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ నలగగొట్టిన మొక్కజొన్నలు 40 కిలోలు ☛ తవుడు 20 కిలోలు ☛ నూనె తీసిన చెక్క 30 కిలోలు ☛ పప్పులపరం 7 కిలోలు ☛ కిలో ఉప్పు ☛ లవణ మిశ్రమం 2 కిలోలు. వీటిని మిక్స్ చేసి క్రీపు దాణా తయారు చేసుకోవచ్చు. ఈ దాణాను గొర్రె పిల్లలకు 3 నుంచి 7 వారాల వరకు తల్లిపాలతో పాటు అందించాలి. దీన్ని గొర్రె పిల్లల శరీర బరువులో ఒకటిన్నర శాతానికి మించకుండా రోజూ అందించాలి.

News November 17, 2025

సౌదీ ప్రమాదంలో 10 మంది హైదరాబాద్ వాసులు మృతి!.. CM దిగ్భ్రాంతి

image

సౌదీ <<18308554>>బస్సు<<>> ప్రమాదంలో 10 మంది హైదరాబాద్‌ వాసులు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం ఆదేశాలతో సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వివరాల కోసం 7997959754, 9912919545 నంబర్లకు కాల్ చేయాలని CS సూచించారు. అటు ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులతో సీఎస్ మాట్లాడారు.

News November 17, 2025

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు కొత్త జీవితం

image

‘ఆపరేషన్ సిందూర్’లో కాలు కోల్పోయిన ఆవుకు పశువైద్యులు కొత్త జీవితాన్ని ఇచ్చారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ జరిపిన షెల్లింగ్‌లో గౌరి అనే ఆవు కాలు కోల్పోయింది. దీంతో దానికి దేశీయంగా తయారు చేసిన ‘కృష్ణ లింబ్’ అనే కృత్రిమ కాలుని అమర్చారు. దీంతో అది మునుపటిలా నడుస్తోంది. డాక్టర్ తపేశ్ మాథుర్ దీన్ని రూపొందించారు. అవసరమైన జంతువుల యజమానులకు వాటిని ఉచితంగా అందిస్తున్నారు.