News December 21, 2024

ఇంద్రకీలాద్రిలో నేటి నుంచి భవానీ దీక్షల విరమణ

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి 25వ తేదీ వరకు భవానీ దీక్షా విరమణలు జరగనున్నాయి. భక్తులు ఏ క్యూలోనైనా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతరాలయ ప్రవేశం ఉండదని, ఆర్జిత సేవలు రద్దు చేశామన్నారు. ఉచిత అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ వివరాలను ప్లే స్టోర్‌లోని ‘భవానీ దీక్ష 2024’ యాప్‌లో చూసుకోవచ్చు. రోజుకు సుమారు లక్ష మంది చొప్పున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా.

Similar News

News December 21, 2024

మా హయాంలోనే రైతుల ఆత్మహత్యలు తగ్గాయి: కేటీఆర్

image

TG: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతు ఆత్మహత్యలతో సతమతమయ్యేదని, తమ హయాంలో సూసైడ్స్ గణనీయంగా తగ్గాయని BRS కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. ‘ఉమ్మడి రాష్ట్రంలో అన్నదాత వెన్నువిరిగింది. NCRB ప్రకారం రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే ఎక్కువ. మొత్తం ఆత్మహత్యల్లో 11.1 శాతం సూసైడ్స్ రాష్ట్రానివే. కానీ మా పాలన ముగిసేసరికి వాటిని 1.5శాతానికి తగ్గించాం’ అని పేర్కొన్నారు.

News December 21, 2024

భారీ వర్షాలు.. సీఎం కీలక ఆదేశాలు

image

AP: అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై CMO అధికారులతో CM చంద్రబాబు సమీక్ష చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులను అధికారులు వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకూ సెలవులు ఇచ్చినట్లు CMకు చెప్పారు. వర్షంతో దెబ్బతిన్న పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందించాలని CBN ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు.

News December 21, 2024

BIG BREAKING: రాష్ట్రంలో మళ్లీ భూప్రకంపనలు

image

AP: ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో స్వల్ప భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, వేంపాడు, ముండ్లమూరు, మారెళ్ల, తూర్పుకంభంపాడు, శంకరాపురం సహా పలుచోట్ల కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ముండ్లమూరు స్కూలు నుంచి విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు.