News August 25, 2024
‘$’ సింబల్‌పై భవీష్ ట్వీట్.. నెట్టింట విమర్శలు!

కంప్యూటర్ కీబోర్డుపై $ సింబల్‌ను తొలగించి ₹ సింబల్‌ను ఏర్పాటు చేయాలని ఓలా సీఈవో భవీష్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలొస్తున్నాయి. దీనిని కొందరు సపోర్ట్ చేస్తుంటే చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. $ సింబల్ డాలర్‌తో పాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉపయోగించే క్యారెక్టర్ అని, కావాలంటే మీ ఉద్యోగులను అడగాలని కౌంటర్ ఇస్తున్నారు. అయితే, OLA కి బదులు ‘ఔలా’ అని మార్చొచ్చుగా అని సెటైర్లు కూడా వేస్తున్నారు.
Similar News
News November 28, 2025
కోకాపేట భూములు అ‘ధర’గొట్టాయి!

HYDలోని కోకాపేటలో నవంబర్ 28న జరిగిన భూముల ఈ-వేలంలో భారీ మొత్తంలో ధరలు నమోదయ్యాయి. నియోపోలిస్, గోల్డెన్ మైల్ ఏరియాల్లోని 15, 16 నంబర్ ప్లాట్లకు ఈ వేలం జరిగింది. ఈ వేలంలో ఒక్కో ఎకరం ₹140 కోట్లు చొప్పున పలికింది. ఈ 2 ప్లాట్లకు కలిపి మొత్తం ₹1268 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట భూములకు వచ్చిన ఈ ధరలు రికార్డు సృష్టించాయి.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్‌బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్‌కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్‌స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం
News November 28, 2025
వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.


