News June 27, 2024
భేష్.. నాగ్ అశ్విన్: చిరంజీవి

‘కల్కి 2898ఏడీ’ దర్శకుడు నాగ్ అశ్విన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. సినిమాకు సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోందని ట్వీట్ చేశారు. ‘ఈ తరహా సై-ఫై సినిమా తీసిన నాగ్ అశ్విన్‌కు అభినందనలు. నాకు ఇష్టమైన నిర్మాత అశ్వినీదత్, ఆయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక, మొత్తం మూవీ టీమ్‌కు కంగ్రాట్స్. ఇలాగే కలలు కని భారత జెండాను మరింతపైకి ఎగురవేయండి’ అని పోస్ట్ చేశారు.
Similar News
News November 9, 2025
గంగూలీ ICC అధ్యక్షుడు అవుతారు: మమతా బెనర్జీ

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఏదో ఒక రోజు ICC ప్రెసిడెంట్ అవుతారని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో WWC విన్నర్ రిచా ఘోష్ సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. తాను కొన్ని విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుతానని, ప్రస్తుత ఐసీసీ అధ్యక్షుడిగా గంగూలీనే ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా గతంలో ఆయన BCCI అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
News November 9, 2025
గుకేశ్‌కు షాక్.. చెస్ వరల్డ్ కప్‌లో ఓటమి

గోవా వేదికగా జరుగుతోన్న చెస్ వరల్డ్ కప్‌లో ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు షాక్ తగిలింది. మూడో రౌండ్లో ఫ్రెడరిక్ స్వాన్(జర్మనీ) చేతిలో 0.5-1.5 పాయింట్ల తేడాతో ఓడిపోయారు. భారత గ్రాండ్ మాస్టర్లు ప్రజ్ఞానంద, అర్జున్, హరికృష్ణ, ప్రణవ్ తదుపరి రౌండ్లకు దూసుకెళ్లారు.
* ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఏషియన్ చెస్ ఛాపింయన్‌షిప్‌లో విజేతగా నిలిచిన రాహుల్.. భారత్ తరఫున 91వ గ్రాండ్ మాస్టర్ హోదా సాధించారు.
News November 9, 2025
సినిమా అప్డేట్స్

* అనుకోని కారణాలతో ఆగిపోయిన జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ను(అనుష్క శర్మ లీడ్ రోల్) విడుదల చేయడానికి మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చిస్తున్నారు.
* వాల్ట్ డిస్నీ నిర్మించిన ‘జూటోపియా’ మూవీకి హిందీలో జూడీ హోప్స్ పాత్రకు శ్రద్ధా కపూర్ వాయిస్ ఇస్తున్నారు. ఈ మూవీ NOV 28న రిలీజవనుంది.
* దళపతి విజయ్ నటించిన ‘జన నాయకుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ మూవీ JAN 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.


