News April 8, 2025
2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పనులు 71% పూర్తయ్యాయని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దేశంలో ఈ ఎయిర్పోర్ట్ ఒక్కటే అధునాతనమైందని, దీంతో దేశ రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నామని, 2026 నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. మంత్రి ఇవాళ విమానాశ్రయ పనులను పరిశీలించారు.
Similar News
News April 17, 2025
ALERT: నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

AP: ఇవాళ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రతోపాటు చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. పిడుగులతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు నిన్న అనకాపల్లి జిల్లా చీడికాడలో 42.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించింది.
News April 17, 2025
SRH: హెడ్, అభిషేక్లపైనే భారమంతా?

IPLలో భాగంగా ఇవాళ MIతో SRH ఢీకొననుంది. కాగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ రాణిస్తేనే SRH గెలుస్తోంది. లేదంటే ఆ జట్టు గాడి తప్పుతోంది. గణాంకాలను చూస్తే ఇది తేటతెల్లమవుతోంది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 21 ఇన్నింగ్సులు ఆడారు. ఇందులో గెలిచిన 11 మ్యాచుల్లో 801 రన్స్ కొట్టారు. అదే ఓడిన 10 ఇన్నింగ్సుల్లో 145 పరుగులే చేశారు. గెలిచిన మ్యాచుల్లో జట్టు రన్ రేట్ 14.5 ఉండగా ఓడిన వాటిలో 8.78 మాత్రమే ఉంది.
News April 17, 2025
2209లో జరిగే కథతో కిచ్చా సుదీప్ మూవీ

హీరో కిచ్చా సుదీప్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు. 2209లో జరిగే కథతో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఇందులో వినూత్నమైన సాహస యాత్రను ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అనుప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని వారు తెలిపారు.