News April 15, 2024
నేనుంటే 2020లోనే భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తయ్యేది: చంద్రబాబు

AP: సలహాదారుల పేరుతో YCP ప్రభుత్వం ప్రజా ధనం వృథా చేస్తోందని TDP చీఫ్ చంద్రబాబు విమర్శించారు. ఆ డబ్బులతో ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చన్నారు. రాజాం సభలో మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను సీఎం నిర్లక్ష్యం చేశారు. నేనుంటే 2020లోనే భోగాపురం విమానాశ్రయం పూర్తయ్యేది. మేం సేకరించిన భూముల యజమానుల మధ్య వైసీపీ నేతలు గొడవ పెట్టారు. గిరిజన వర్సిటీ విషయంలోనూ ఇలాగే చేశారు’ అని ఫైరయ్యారు.
Similar News
News April 7, 2026
NExT పరీక్షపై ఫేక్ లెటర్.. నమ్మొద్దు: PIB

ఎంబీబీఎస్ విద్యార్థుల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) పరీక్ష నిర్వహించనుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ వెల్లడించింది. 2022 బ్యాచ్ నుంచి ఈ పరీక్ష వర్తిస్తుందని ఇంటర్నెట్‌లో సర్కులేట్ అవుతున్న లెటర్ ఫేక్ అని స్పష్టం చేసింది. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దని.. షేర్ చేసే ముందు వెరిఫై చేసుకోవాలని సూచించింది.

రూ.39,436 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

AP: రాష్ట్రంలో రూ.39,436 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టే 31 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేవలం విద్యుత్ రంగంలోనే 8 ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినట్లు TDP ట్వీట్ చేసింది. వీటి ద్వారా యువతకు 1,11,278 ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు పేర్కొంది. అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16వ SIPB సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించింది.