News September 13, 2025
భోగాపురం దాదాపు పూర్తయినట్లే: కేంద్ర మంత్రి రామ్మోహన్

AP: భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు 86 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వర్షాలు కురుస్తున్నా GMR సంస్థ పనులు ఆపడం లేదన్నారు. విజయనగరంలో విమానాశ్రయ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ‘వచ్చే ఏప్రిల్‌లోగా వైజాగ్ నుంచి రోడ్డు కనెక్టివిటీ పనులు పూర్తి చేస్తాం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు కసరత్తులు చేస్తున్నాం. బీచ్ కారిడార్ కోసం ఇప్పటికే DPR సిద్ధం చేశాం’ అని వివరించారు.
Similar News
News February 7, 2026
మచిలీపట్నంలో 38 మంది అధికారులపై చర్యలు

మచిలీపట్నం నగర పాలక సంస్థలో పని చేస్తున్న 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ACB అధికారులు చేపట్టిన తనిఖీల్లో బిల్లులు ఇవ్వకుండా కొత్త నీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం, ఇంటి పన్నుల విధింపులో అవకతవకలు చేశారని గుర్తించారు. దీనికి బాధ్యులైన 38 మందిపై శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. వీరిలో అప్పటి మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ ఉన్నారు.
News February 7, 2026
అన్ని US పారిశ్రామిక వస్తువులపై భారత్ జీరో డ్యూటీ: పీయూష్ గోయల్

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై ఏడాదిపాటు చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత జెమ్స్ అండ్ జువెలరీపై జీరో టారిఫ్స్ వర్తిస్తాయని తెలిపారు. ఏడాదికి $500 బిలియన్ల వాణిజ్యం టార్గెట్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సుంకాలను మరింత తగ్గించే విషయంపై చర్చిస్తున్నామన్నారు. USకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై భారత్ సున్నా సుంకాలు విధిస్తుందని వెల్లడించారు.
News February 7, 2026
పసికూనపై అతికష్టం మీద గెలిచిన పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ అతి కష్టం మీద గెలిచింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫర్హాన్(47), అయూబ్(24) రాణించారు. చివర్లో ఫహీమ్ అష్రఫ్(29*) ధనాధన్ ఇన్నింగ్స్‌తో గెలిపించారు. 19వ ఓవర్లో 24 రన్స్ రావడంతో సమీకరణాలు మారిపోయాయి. పాక్ తర్వాతి మ్యాచ్ ఈ నెల 10న USAతో ఆడనుంది.


