News July 10, 2024
భోలే ఆశ్రమంలోకి లేడీస్‌కు మాత్రమే ఎంట్రీ?

‘హాథ్రస్’ భోలే బాబా గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని ఖేడ్లీ టౌన్ సమీపంలో సహజపూర్ గ్రామంలో అతడికో ఆశ్రమం ఉంది. చుట్టూ ఎత్తైన ప్రహారీ గోడలు ఉండే ఆ ఆశ్రమంలో స్థానికులకు, పురుషులకు ఎంట్రీ లేదని.. స్త్రీలకు మాత్రమే అనుమతి ఉంటుందని వారు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ముందస్తు అనుమతి లేకుండా లోపలికి వెళ్తే సిబ్బంది దాడి చేస్తారని గ్రామస్థులు చెబుతుండటం గమనార్హం.
Similar News
News March 15, 2026
నావిక్‌కు అంతరాయం

GPSకు ప్రత్యామ్నాయంగా భారత్ అభివృద్ధి చేసిన NavIC(నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్)కు ఇబ్బంది ఎదురైంది. ఈ వ్యవస్థలో భాగంగా ఏర్పాటైన 4 శాటిలైట్ల(IRNSS)లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో అధికారులు తెలిపారు. ఇందులోని 3 అటామిక్ క్లాక్‌లలో ఇప్పటికే 2 చెడిపోగా, చివరిదీ ఫెయిలవడంతో నావిగేషన్, పొజిషనింగ్ సేవలు నిలిచిపోయాయన్నారు. 10ఏళ్ల కాలపరిమితితో ఈ ఉపగ్రహాన్ని 2016 మార్చి 10న ఇస్రో ప్రయోగించింది.
News March 15, 2026
భారీగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో గత వారం KG స్కిన్ లెస్ ₹290-300 ఉండగా, ఇవాళ రూ.350 వరకు అమ్ముతున్నారు. APలోని పలు ప్రాంతాల్లో ₹315-320గా ఉంది. ఇవాళ ఆదివారం కావడంతో రేట్లు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి తగ్గడం, ఎండ వేడికి కోళ్లు చనిపోతుండటంతో ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్థాయికి చికెన్ రేటు చేరడం ఇదే తొలిసారని వ్యాపారులు అంటున్నారు.
News March 15, 2026
సరదా కోసం మరోసారి దాడి చేస్తాం: ట్రంప్

ఇరాన్‌లోని <<19378419>>ఖర్గ్<<>> ద్వీపంపై కేవలం ఫన్ కోసమే తాము మరిన్ని దాడులు చేయొచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ తమతో డీల్‌కు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోందని, కానీ కండీషన్లే సరిగ్గా లేవని విమర్శించారు. ‘ఖర్గ్‌లోని చాలా భాగాన్ని పూర్తిగా నాశనం చేశాం. మేం వినోదం కోసం మళ్లీ అటాక్స్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ బతికే ఉన్నారా’ అని ప్రశ్నించారు.


