News March 22, 2025

BHPL: అటవీ భూముల కేటాయింపుపై సమీక్ష

image

 చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన అటవీ భూముల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం ఐడీఓసీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అటవీ, రెవెన్యూ, సర్వే, ఆర్అండ్‌‌బీ, మెగా ప్రాజెక్టు అధికారులకు అవసరమైన భూముల కేటాయింపునకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News September 17, 2025

జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి: అంజన్ కుమార్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ పేరు అనుహ్యంగా తెరమీదకు వచ్చింది. ఇటీవల ‘రావాలి అంజన్న.. కావాలి అంజన్న’ అంటూ వెలసిన ఫ్లెక్సీలకు అంజన్ కుమార్ యాదవ్ బలం చేకూర్చారు. ‘యాదవ సామాజిక వర్గానికి సిటీలో ప్రాతినిధ్యం లేదు. జూబ్లీహిల్స్ టికెట్ నాకే ఇవ్వాలి’ అంటూ కుండబద్దలు కొట్టారు. మంత్రి పదవి కోరుకోవడంలో తప్పేముందని, హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

PDPL: ‘సమాజం బలంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి’

image

సమాజం బలంగా ఉండాలంటే మహిళలు ఆరోగ్యంగా, ఆత్మ విశ్వాసంతో ఉండాలని పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జరిగిన స్వస్తి నారి- సశక్తి పరివార అభియాన్ కార్యక్రమంలో MP పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను ఆయన పరిశీలించారు. జిల్లా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.