News March 12, 2025
BHPL: అన్నను హతమార్చిన తమ్ముడికి జీవిత ఖైదు

అన్నను చంపిన కేసులో తమ్ముడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన ఘటన <<1978567>>BHPL జిల్లాలో<<>> జరిగింది. పోలీసుల వివరాలు.. కాటారం మం. గంగారానికి చెందిన నాగరాజు, అశోక్ అన్నదమ్ములు. ఆస్తి పంపకాల అనంతరం.. తమ్ముడు స్థలాన్ని అమ్ముకుని డబ్బు ఖర్చు చేశాడు. తీరా అన్న ఆస్తిలో వాటా వస్తుందని ఇబ్బంది పెట్టడంతో ఊరి విడిచి వెళ్లారు. MPTC ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన అన్నతో గొడవకు దిగి బీరు సీసాతో తమ్ముడు హతమార్చాడు.
Similar News
News December 21, 2025
ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News December 21, 2025
ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం: రేవంత్

TG: కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టిన ద్రోహి KCR అని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఆ సంతకంతో 3 జిల్లాలకు మరణశాసనం రాశారని విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కాళేశ్వరం కూలినా వరి ఉత్పత్తిలో TGని అగ్రస్థానంలో నిలిపాం. కృష్ణా జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. పదేళ్ల KCR పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు’ అని చిట్‌చాట్‌లో మండిపడ్డారు.
News December 21, 2025
నిర్మల్ కలెక్టరేట్లో ప్రజావాణి వాయిదా

ఈనెల 22న జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి వాయిదా వేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈనెల 29 నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందన్నారు. గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ప్రజావాణి వాయిదా వేశామన్నారు.


