News March 12, 2025
BHPL: అన్నను హతమార్చిన తమ్ముడికి జీవిత ఖైదు

అన్నను చంపిన కేసులో తమ్ముడికి జీవితఖైదు విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిన ఘటన <<1978567>>BHPL జిల్లాలో<<>> జరిగింది. పోలీసుల వివరాలు.. కాటారం మం. గంగారానికి చెందిన నాగరాజు, అశోక్ అన్నదమ్ములు. ఆస్తి పంపకాల అనంతరం.. తమ్ముడు స్థలాన్ని అమ్ముకుని డబ్బు ఖర్చు చేశాడు. తీరా అన్న ఆస్తిలో వాటా వస్తుందని ఇబ్బంది పెట్టడంతో ఊరి విడిచి వెళ్లారు. MPTC ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన అన్నతో గొడవకు దిగి బీరు సీసాతో తమ్ముడు హతమార్చాడు.
Similar News
News March 20, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 38.9°C నమోదు కాగా, జమ్మికుంట 38.7, చిగురుమామిడి 38.2, శంకరపట్నం 38.0, కరీంనగర్ రూరల్ 37.9, గన్నేరువరం 37.7, మానకొండూర్ 37.6, తిమ్మాపూర్ 37.3, వీణవంక 37.2, రామడుగు 37.0, కరీంనగర్ 36.7, కొత్తపల్లి 36.0, హుజూరాబాద్ 35.5, ఇల్లందకుంట 35.4, చొప్పదండి 35.0, సైదాపూర్ 34.6°C గా నమోదైంది.
News March 20, 2025
అమలాపురం కుర్రాడికి గేట్‌లో 10వ ర్యాంక్

అమలాపురం మండలం బండారులంకక చెందిన చేనేత కార్మికుని కుమారుడు పిచ్చుక కుమార్ వాసు గేట్ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియాలో పదవ ర్యాంకు సాధించాడు. బండారులంక గ్రామానికి పేరు తీసుకొచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు మల్లేశ్వరరావు, రేణుక వాణి దంపతులను పలువురు సత్కరించారు.
News March 20, 2025
తూ.గో : ఈ మండలాల ప్రజలకు హెచ్చరిక

తూ.గో జిల్లాలో నేడు ఎండలు విపరీతంగా ఉండనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. జిల్లాలోని గోకవరం, కొవ్వూరు, పెరవలి, రాజమండ్రి, రాజానగరం మండలాల్లో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ఆ జిల్లాలో ఎండలతో పాటు వడగాల్పులు కూడా వీస్తాయని బయటకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.