News February 4, 2025

BHPL: అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి

image

ఆర్థిక పునరావాస పథకం కింద అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. కావున, అర్హులైన దివ్యాంగులు ఆన్లైన్ వెట్ సైట్ www.tsobmms.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అర్హత, ఇతర వివరాలకై జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News December 7, 2025

స్పీకర్‌కు హరీశ్‌ రావు బహిరంగ లేఖ

image

శాసన సభ నిబంధనలను పాటించకుండా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖలో విమర్శించారు. రెండేళ్లయినా హౌస్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం, డిప్యూటీ స్పీకర్ నియామకాన్ని నిర్లక్ష్యం చేయడం, ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. రాతపూర్వక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదని హరీశ్ పేర్కొన్నారు.

News December 7, 2025

వంటింటి చిట్కాలు

image

* పనీర్ ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే బ్లాటింగ్ పేపర్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టండి.
* ఇంట్లో తయారు చేసిన స్వీట్స్​లో షుగర్​ మరీ ఎక్కువైతే.. కాస్త నిమ్మరసం కలపండి. కాస్త తీపి తగ్గుతుంది. అలాగే వెనిగర్​ కూడా వాడొచ్చు.
* వంట చేసినప్పుడు చేతులు కాలితే బంగాళదుంపతో రుద్దితే మంట తగ్గుతుంది.
* కరివేపాకు పొడి చేసేటప్పుడు అందులో వేయించిన నువ్వుల పొడి వేస్తే మరింత రుచిగా ఉంటుంది.

News December 7, 2025

పులివెందులలో YS జార్జిరెడ్డికి విజయమ్మ నివాళి.!

image

మాజీ ముఖ్యమంత్రి YSR సోదరుడు వైయస్ జార్జిరెడ్డి వర్ధంతి ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ సమాధుల తోటలో వైయస్ జార్జిరెడ్డి సమాధితోపాటు రాజారెడ్డి, వివేకానందరెడ్డి సమాధుల వద్ద పూలమాలలు పెట్టి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ నివాళులర్పించారు. అనంతరం పులివెందులలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.