News February 4, 2025

BHPL: అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలి

image

ఆర్థిక పునరావాస పథకం కింద అర్హులైన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. కావున, అర్హులైన దివ్యాంగులు ఆన్లైన్ వెట్ సైట్ www.tsobmms.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. అర్హత, ఇతర వివరాలకై జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

Similar News

News February 20, 2025

Beautiful Photo: రోహిత్ ఖుషీ.. టీమ్ జోష్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రేపు బంగ్లాతో తలపడేందుకు భారత జట్టు నేడు ప్రాక్టీస్ సెషన్‌లో తీవ్రంగా శ్రమించింది. ఫుట్‌బాల్ ఆడుతున్న సమయంలో జట్టు ఆటగాళ్లంతా రోహిత్ చుట్టూ చేరి నవ్వుతూ కనిపించారు. రోహిత్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టు సభ్యులు హిట్‌మ్యాన్‌పై చూపే ప్రేమ, ఆప్యాయతకు ఇది నిదర్శమని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై మీ COMMENT.

News February 20, 2025

రాత్రిపూట వీటిని తింటున్నారా?

image

రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాల జోలికి పోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, సోడా, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఇవి తింటే సరిగ్గా నిద్రపట్టదు. స్వీట్లు, చాక్లెట్లు తినడం మంచిది కాదు. పరోటా, బంగాళదుంపల జోలికి వెళ్లొద్దు. డీప్ ఫ్రై, స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు, పచ్చి ఉల్లిపాయలు తింటే కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.

News February 20, 2025

భద్రాద్రి జిల్లా TOP NEWS

image

✓భద్రాచలం సరిహద్దు గ్రామాల్లో పోలీసుల ముమ్మర తనిఖీ✓ భద్రాచలంలో చైన్ స్నాచింగ్ ✓ సేవాలాల్ జయంతి వేడుకల్లో స్టెప్పులేసిన జిల్లా కలెక్టర్ ✓ మణుగూరులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ✓ సంపన్నుల కోసమే కేంద్ర బడ్జెట్: సీపీఎం✓ జాతరలో ఎమ్మెల్యే కోరం కనకయ్య డాన్స్ ✓ భద్రాచలంలో ఎండు గంజాయి పట్టుకున్న పోలీసులు ✓ అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు: భద్రాద్రి ఎస్పీ

error: Content is protected !!