News February 21, 2025
BHPL: ఆడ పులి వాసన పసిగడుతూ పెద్ద పులి ప్రయాణం?

కాటారం సబ్ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 11 రోజులుగా మూడున్నరేళ్ల మగ పెద్ద పులి ఆడ పులి వాసనను పసిగడుతూ ప్రయాణం చేస్తోందని తెలిసింది. వేమనపల్లి అడవులకు ఓ ఆడ పులి చేరి సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో మగ పులి ఆడ తోడు(మేటింగ్) కోసం అంతా గస్తీ చేస్తోంది. గోదావరి సరిహద్దుల వరకు వెళ్లి తిరిగి వస్తోందని అధికారుల ద్వారా తెలిసింది.
Similar News
News November 19, 2025
KNL: పిల్లల హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో కన్నబిడ్డలను చంపిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో సింధ్ ధనోజీ రావు తన కూతురు నిఖిత (7), కొడుకు మధు చరణ్ (4)ను నంద్యాల జిల్లాలోని జూపాడుబంగ్లా ప్రాంతంలో నీటి కుంటలో ముంచి చంపాడు. ఈ కేసు విచారణలో నేరం రుజువు కావడంతో కర్నూలులోని 7వ న్యాయస్థానం జడ్జి నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.
News November 19, 2025
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్గా పరిగణిస్తారు.
News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


