News February 21, 2025
BHPL: ఆడ పులి వాసన పసిగడుతూ పెద్ద పులి ప్రయాణం?

కాటారం సబ్ డివిజన్ పరిధిలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. 11 రోజులుగా మూడున్నరేళ్ల మగ పెద్ద పులి ఆడ పులి వాసనను పసిగడుతూ ప్రయాణం చేస్తోందని తెలిసింది. వేమనపల్లి అడవులకు ఓ ఆడ పులి చేరి సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో మగ పులి ఆడ తోడు(మేటింగ్) కోసం అంతా గస్తీ చేస్తోంది. గోదావరి సరిహద్దుల వరకు వెళ్లి తిరిగి వస్తోందని అధికారుల ద్వారా తెలిసింది.
Similar News
News March 25, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ పారపట్టి పనిచేసిన భద్రాద్రి కలెక్టర్ ✓ జూలూరుపాడు: ట్రాలీ బోల్తా.. పదిమందికి గాయాలు ✓ భద్రాచలం బ్రిడ్జిపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య ✓ కొత్తగూడెంలో న్యాయవాది కార్లకు నిప్పు పెట్టిన దుండగులు ✓ సారపాకలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత ✓ జిల్లా వ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసన ✓ భద్రాచలం: ఎన్కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టుల మృతి ✓ పినపాక: స్కూల్‌లో ఆకతాయిలు నిప్పంటించారు.
News March 25, 2025
రానున్న 4 రోజులు జాగ్రత్త

TG: రాష్ట్రంలో రానున్న 4 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణం కంటే 2-3°C ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. వారం నుంచి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వేడిగాలులతో పాటు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అలాగే ఈ నెల 30 వరకు వర్షాలు పడే ఆస్కారం లేదని, పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. వడదెబ్బ సోకకుండా ప్రజలు నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 25, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> దేవరుప్పుల పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య > దేవన్నపేట నుంచి సాగునీటిని విడుదల చేయాలి: ఎర్రం రెడ్డి తిరుపతిరెడ్డి > కూలీలతో కలిసి ఉపాధి హామీ పనులు చేసిన కలెక్టర్ > డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి > ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను పరిశీలించిన కలెక్టర్ > పాలకుర్తి: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి > మంత్రులు పొన్నం, సీతక్కను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి