News February 10, 2025

BHPL: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

మైనార్టీ సంక్షేమ శాఖ స్టడీ సర్కిల్ (HYD) ఆధ్వర్యంలో జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువత, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రూప్ 1, 2, 3, 4, RRB, SSC & BANKING పోటీ పరీక్షల కొరకు 4 నెలల ఉచిత బేసిక్ ఫౌండేషన్ కోర్స్‌లో శిక్షణ ఇస్తున్నది. ఈ శిక్షణకు సంబంధించి ఈనెల 15 వరకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు. 

Similar News

News November 24, 2025

బాపట్ల: మాంసం దుకాణాల్లో మోసాలు..!

image

బాపట్ల జిల్లా పర్చూరు, కారంచేడులోని మాంసం దుకాణాలను తూనికలు కొలతల అధికారి నాగేశ్వరరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొత్తం ఆరు దుకాణాల్లో కాటాలకు సరైన ముద్రలు లేనట్లు గుర్తించారు. వారికి రూ.9 వేలు ఫైన్ వేశారు. కొలతల్లో లోపాలు ఉంటే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వినియోగదారులకు కచ్చితమైన తూకంతో నాణ్యమైన సరుకులు అందజేయాలని ఆదేశించారు. మీ దగ్గర తూకాల్లో మోసం జరుగుతుందా? కామెంట్ చేయండి.

News November 24, 2025

ఇది సరిగా ఉంటే ఆరోగ్యం మీ వెంటే..

image

మనిషి జీవనశైలిని నియంత్రించేది జీవ గడియారం. అంటే బయోలాజికల్ క్లాక్. రోజువారీ జీవితంలో నిద్ర, ఆకలి, జీర్ణక్రియ, జీవరసాయన ప్రక్రియలు సమయానికి జరిగేలా చూస్తుంది. అయితే దీంట్లో సమతుల్యత లోపిస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. శారీరకంగా, మానసికంగా క్రమంగా శక్తిహీనులుగా మారిపోతుంటే అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News November 24, 2025

ఖమ్మం: రిజర్వేషన్లు ఖరారు.. కలెక్టర్ గెజిట్ విడుదల

image

ఖమ్మం జిల్లాలోని 20 మండలాల్లో ఉన్న 571 గ్రామ పంచాయతీలకు సర్పంచ్, 5214 వార్డుల రిజర్వేషన్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో సర్పంచ్ రిజర్వేషన్లలో 260 మహిళలకు.. 311 జనరల్ స్థానాలను కేటాయించారు. అలాగే 5,214 వార్డుల్లో 2,252 మహిళలకు కేటాయించారు. ఈ రిజర్వేషన్ల నివేదికను నేడు రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు.