News March 20, 2025
BHPL: కుల మతాలకు అతీతంగా.. బడి పంతుల్ల స్నేహం

చిట్యాల మండలంలో జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కులమతాలకు అతీతంగా బడిపంతుల్లు స్నేహాన్ని కనబరుచుకుంటున్నారు. ముస్లింకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్.రఫీకి రానున్న రంజాన్కు డ్రై ఫ్రూట్స్ అందజేసి విద్యార్థుల ముందు మమకారాన్ని పంచుకున్నారు. తనువుకు ఉత్సాహం ఇచ్చే ఉత్ప్రేరకమే స్నేహం అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణ, రాధికరాణి, మమత, ఉమాదేవి, రంజిత్ కుమార్, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
REWIND: ‘జనతా కర్ఫ్యూ’ గుర్తుందా?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజున ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు దేశమంతటా స్వచ్ఛంద బంద్కు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ విధించింది. ఎక్కడికక్కడ దేశం స్తంభించడంతో వలస జీవులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా మీపై ఎలాంటి ప్రభావం చూపింది? COMMENT
News March 21, 2025
పెదబయలు : మంచులో తేలుతున్న సూర్యుడు

పెదబయలు మండలం తూలం గ్రామ పరిసర కొండల్లో శుక్రవారం తెల్లవారుజామున పొగ మంచు కమ్మేసింది. అయితే తేలియాడే మేఘాలపై.. సూర్యుడు ఉదయిస్తున్న దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. పర్యాటక ప్రేమికులు ఉత్సాహంగా ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేస్తున్నారు.
News March 21, 2025
ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు

AP: అలిపిరిలో ముంతాజ్, మరో హోటల్కు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని రద్దు చేస్తున్నట్లు CM చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకొని కమర్షియలైజేషన్ ఉండకూడదన్నారు. శ్రీవారి ఆస్తులన్నీ కాపాడటమే లక్ష్యమన్నారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయం కట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. సీఎంలు ముందుకొస్తే నిర్మాణాలు చేపడతామన్నారు. అంతకుముందు ఆయన దేవాన్ష్ బర్త్డే సందర్భంగా అన్నవితరణ చేశారు.