News March 20, 2025
BHPL: కుల మతాలకు అతీతంగా.. బడి పంతుల్ల స్నేహం

చిట్యాల మండలంలో జూకల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కులమతాలకు అతీతంగా బడిపంతుల్లు స్నేహాన్ని కనబరుచుకుంటున్నారు. ముస్లింకు చెందిన ఉపాధ్యాయుడు డాక్టర్.రఫీకి రానున్న రంజాన్‌కు డ్రై ఫ్రూట్స్ అందజేసి విద్యార్థుల ముందు మమకారాన్ని పంచుకున్నారు. తనువుకు ఉత్సాహం ఇచ్చే ఉత్ప్రేరకమే స్నేహం అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణ, రాధికరాణి, మమత, ఉమాదేవి, రంజిత్ కుమార్, రవీందర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News April 17, 2025
విధ్వంసం.. 26 బంతుల్లో సెంచరీ

యూరోపియన్ క్రికెట్ సిరీస్(T10)-ఇటలీలో సంచలనం నమోదైంది. సివిడేట్ జట్టుతో మ్యాచ్‌లో మిలానో ప్లేయర్ జైన్ నఖ్వీ 26బంతుల్లోనే శతకం బాదారు. క్రికెట్ హిస్టరీలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. అతను మొత్తంగా 37 బంతుల్లో 160* రన్స్(24 సిక్సర్లు, 2 ఫోర్లు) చేశారు. ఇన్నింగ్స్ 8, 10వ ఓవర్లలో 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టారు. నఖ్వీ విధ్వంసంతో ఆ జట్టు 10 ఓవర్లలో 210/2 స్కోర్ చేయగా, ప్రత్యర్థి టీమ్ 106 పరుగులకే ఆలౌటైంది.
News April 17, 2025
అచ్చంపేట: ‘వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి’

అచ్చంపేట పట్టణంలో గురువారం సీపీఎం జిల్లా కార్యదర్శి వి.పర్వతాలు మాట్లాడారు. జిల్లాలోని ప్రతి మండలంలో ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తోందని అన్నారు. వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.
News April 17, 2025
అనకాపల్లి: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై కలెక్టర్ సమీక్ష

అనకాపల్లి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం అట్రాసిటీ కేసుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా దర్యాప్తులో పూర్తి వివరాలు సేకరించి సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయాలన్నారు. ఎస్పీ తుహీన్ సిన్హా, ఆర్డీవో సత్యనారాయణ రావు పాల్గొన్నారు.