News February 12, 2025

BHPL: కొత్త రేషన్‌కార్డుల కోసం మీ సేవాలో అప్లయ్ చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

నూతన రేషన్ కార్డుల నమోదు ప్రక్రియకు మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ చేయటానికి అవకాశం కల్పించినట్లు భూపాలపల్లి అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ చేయుటలో మీ సేవా కేంద్రాల నిర్వాహకులు నిర్దేశించిన రుసుము కంటే అధికంగా వసూలు చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు, ఈడీఎం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.

Similar News

News November 24, 2025

HYD: ‘విద్యార్థుల వివరాలు వారంలో పంపండి’

image

HYDలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను వారంలోపు పంపిచాలని కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌పై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో DRO వెంకటాచారితో కలిసి ఆమె పాల్గొన్నారు. విద్యార్థుల వివరాలు వారంలోపు అందజేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.

News November 24, 2025

VPR దంపతులను కలిసిన జడ్పీ సీఈవో

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన్ను జిల్లా పరిషత్‌కు కొత్త సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో నగరంలోని వీపీఆర్‌ నివాసానికి వచ్చిన ఆయన వేమిరెడ్డి దంపతులను కలిసి బొకే అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వేమిరెడ్డి సూచించారు.

News November 24, 2025

కాసేపట్లో నెల్లూరుకు మంత్రి సత్యకుమార్ రాక

image

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.. సాయంత్రం వరకు అక్కడే కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.